ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఈ రోజు 8 గంటల పాటు బండి సంజయ్(Bandi Sanjay) సన్నిహితుడు, న్యాయవాది శ్రీనివాస్‌ను విచారించింది. కేసులోని ముగ్గురు నిందితుల్లో ఒకరిగా ఉన్న సింహయాజీకి విమానం టికెట్ బుక్ చేసింది శ్రీనివాస్(Srinivas) కావడంతో.. ఈ కేసులో ఆయన చెప్పే విషయాలు కీలకంగా మారతాయని భావించిన సిట్(SIT) .. ఆయనను సుదీర్ఘంగా విచారించింది. రేపు కూడా ఆయనను విచారణ హాజరుకావాల్సిందిగా సిట్ సూచించింది. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు తెలంగాణలోని మరికొందరు బీజేపీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సిట్ నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరుకాని బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, తుషార్‌లపై చర్యలు తీసుకునేందుకు సిట్ సిద్ధమవుతోందని తెలుస్తోంది.
ఇక శ్రీనివాస్ తో పాటు సిట్ పలువురికి నోటీసులు ఇచ్చింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు జేడీజేఎస్ పార్టీ అధ్యక్షుడు తుషార్ కేరళకు చెందిన డాక్టర్ జగ్గుజీస్వామికి నేడు 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే ఇప్పటివరకు కేవలం బండి సంజయ్ అనుచరుడు, కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్ మాత్రమే హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో విచారణకు హాజరైనట్లు తెలుస్తుంది. మిగతా ముగ్గురు సిట్ విచారణ హాజరు కాలేదని తెలుస్తుంది. ఈ విచారణకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు జేడీజేఎస్ పార్టీ అధ్యక్షుడు తుషార్, కేరళకు చెందిన డాక్టర్ జగ్గుజీస్వామి హాజరు అవ్వకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.
కాగా రామచంద్రభారతి (Rama chandra bharathi), సింహయాజి (Simhayaji)లకు ఫ్లైట్ టికెట్ శ్రీనివాస్ బుక్ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. రాంచంద్రభారతికి, సింహయాజికి శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్లు అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు సిట్ అధికారులు అతడికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.
TRS MLAs Poaching Case: అందుకే ఫ్లైట్ టికెట్ బుక్ చేశా..ఈడీ విచారణలో బండి సంజయ్ అనుచరుడు వివరణ
Chiranjeevi: మా తమ్ముడు సీఎం అవడం ఖాయం .. పవన్ కల్యాణ్ పొలిటికల్ సైలెంట్‌ని బ్రేక్ చేసిన చిరంజీవి
అయితే ఒకవేళ విచారణకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు జేడీజేఎస్ పార్టీ అధ్యక్షుడు తుషార్, కేరళకు చెందిన డాక్టర్ జగ్గుజీస్వామి కూడా హాజరు అయితే వీరిని కలిపి విచారిస్తారా లేక వేర్వేరుగా విచారించి కీలక విషయాలను బయటకు తీస్తారా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, TRS MLAs Poaching Case