TSPSC పేపర్ల లీకేజీ కేసును విచారిస్తున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. మరికాసేపట్లో నోటీసులు ఇచ్చేందుకు సిట్ సభ్యులు ఆయన ఇంటికి వెళ్లనున్నారు. పేపర్ల లీకేజీకి సంబంధించి పలు ఆరోపణలు చేసిన బండి సంజయ్(Bandi Sanjay).. ఒకే ఊరితో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలు సమర్పించేందుకు ఈ నెల 24న సిట్ ఎదుట హాజరురావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై నిన్న రేవంత్ రెడ్డికి(Revanth Reddy) కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయనను ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని.. తన దగ్గర ఉన్న ఆధారాలను చూపించాలని నోటీసుల్లో పేర్కొంది.
మరోవైపు ఈ కేసు విచారణలో సిట్ దూకుడుగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, జగిత్యాలలో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ఇళ్లలో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. మూడు చోట్ల అధికారుల దర్యాపు చేస్తున్నారు. రాజశేఖర్ సొంతూరు జగిత్యాల జిల్లా తాటిపల్లికి కూడా అధికారులు వెళ్లారు. రేణుకతో పాటు భర్త నాయక్‌తో కలిసి ముందుగా లంగర్‌హౌస్‌కు వెళ్లారు. సన్ సిటీలోని కాళీ మందిర్‌కి వెళ్లి అనుమానితులను ప్రశ్నించారు. రేణుక సొంతూరు మహబూబ్‌నగర్ జిల్లా గండ్వీడ్‌కు సిట్ బృందం వెళ్లింది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విచారణను హైకోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. మంగళవారం ఈ కేసుకు సంబందించి హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ ధన్కా వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదించారు. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ వివరాలు కోర్టుకు సమర్పించాల్సిందిగా ఏజీని కోర్టు ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్రపై విచారణ చేపట్టాలంటూ ఎన్‌ఎస్‌యూఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు విచారణ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు.
MLC Kavitha : ఈడీనే కవిత ప్రశ్నించారా..? అసలు లోపల ఏం జరిగిందంటే?
TS New Jobs: తెలంగాణలో మరో 1540 ఉద్యోగాలు .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం..
టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో వాటి పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పరీక్ష పేపర్లతోపాటు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్ల పరిరక్షణ కోసం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఐఏఎస్ స్థాయి కస్టోడియన్ అధికారిని నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు పరీక్షల నిర్వహణకు ప్రత్యేక కంట్రోలర్‌ను కూడా నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. టీఎస్‌పీఎస్సీలో ప్రస్తుతం కార్యదర్శి పేరిట ఒక ఐఏఎస్ అధికారి పోస్టు ఉంది. కొన్ని పరిపాలన వ్యవహారాలను కార్యదర్శి పర్యవేక్షిస్తుండగా, మిగిలిన అనేక పనులు చైర్మన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల భద్రత వంటి అంశాలను నేరుగా చైర్మన్ పర్యవేక్షిస్తున్నారు. పని ఒత్తిడి ఉన్న సమయంలో ప్రశ్నపత్రాల భద్రత బాధ్యతలను ఇతర అధికారులకు చైర్మన్ బదలాయిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Telangana, TSPSC Paper Leak