Brother rape on Sister : రోకలి బండతో అన్నను కొట్టి చంపిన చెల్లెలు...అత్యచారమే కారణం..!

రోకలి బండతో అన్నను కొట్టి చంపిన చెల్లెలు...అత్యచారమే కారణం..!

Brother rape on Sister : మద్యం మత్తులో తనపై లైంగిక వేధింపులతో పాటు అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించిన ఓ అన్నను చెల్లెలు దారుణంగా కడతేర్చింది..తన మానాన్ని కాపాడుకునేందుకు ఇంట్లో ఉన్న రోకలి బండతో కొట్టడంతో అన్న అక్కడికక్కడే చనిపోయాడు.

  • Share this:
ఓ వైపు మహిళలపై జరిగే అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే..మరోవైపు ఆ అత్యచారాలు తనమన అనే భేదం లేకుండా తయారయ్యాయి..మహిళలపై హత్యలు అత్యాచారాలు చేయడమే మహా నేరంగా పరిగణిస్తుంటే...ఇప్పుడు అవి స్వంత ఇంటికే చేరుతున్నాయి..దీంతో తల్లి , చెల్లి అనే భేదం లేకుండా కీచకలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు...దుర్మార్గులు మద్యం మత్తులో ఎలాంటీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో అర్థం కాని స్థిని నెలకొంది. ఈనేపథ్యంలోనే ఇటివలే ఓతల్లిపై అత్యాచారం చేసిన కొడుకును బండరాయితో మోది చంపితే తాజాగా ఓ చెల్లెలిని మద్యం మత్తులో లైంగికవేధింపులు చేస్తున్న అన్నను రోకలి బండతో కొట్టి చంపిన సంఘటన చోటు చేసుకుంది.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో చెల్లెలిపై అసభ్యకరంగ ప్రవర్తించిన అన్నను రోకలిబండతో తలపై మోది చంపిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది . స్థానికులు , టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...

కరీంనగర్‌లోని విద్యానగర్‌లో నివాసముంటున్న సతీష్ ( 35 ) గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి చెల్లెలితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది...అన్న నుండి తప్పించుకునేందుకు ఇంట్లో ఉన్న రోకలి బండనే ఆయుధంగా చేసుకుంది..దీంతో దుర్మార్గంగా వేధిస్తున్న అన్నను రోకలిబండతో తలపై గట్టిగా కొట్టింది..అయితే మద్యం మత్తులో సతీష్ ఉండడంతో తల నుండి రక్తం కారి అక్కడికక్కడే మృతిచెందిడు.

ఈ క్రమంలోనే స్థానికుల ద్వార సమాచారo అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు . అర్థరాత్రి వరకు విచారణ కొనసాగించారు.. సంఘటనకు దారి తీసిన అంశాలపై పోలీసులు తమ స్టైల్లో ఆరా తీశారు. సంఘటన జరిగినప్పుడు ఇంట్లో సతీష్ తల్లిదండ్రులు కూడా ఉండడంతో వారి నుండి వివరాలు సేకరించారు.

అయితే తనను ప్రతి రోజు తాగి వచ్చి అసభ్యకరంగా మాట్లాడుతూ, లైంగిక వేధిస్తున్నాడని ,చేసేది ఏమి లేక నన్ను నేను కాపాడుకోవడానికి రోకలి బండతో కొట్టడంతో చనిపోయాడని వివరించింది..పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

కాగా ఇటివల వనపర్తి జిల్లాలో కూడా ఇలాంటీ సంఘటన చోటు చేసుకుంది.. తాజా సంఘటనలో చెల్లెలిని లైంగిక వేధింపులకు గురి చేస్తే...వనపర్తి  జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో తన కుమారుడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో కన్నతల్లే అతడిని కడతేర్చింది. చనిపోయిన విషయం కూడ బయటకు తెలియకుండా చేసింది. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన హరిజన్‌ నాగమ్మ అనే మహిళకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే కుమారుడు శివ (26) మద్యానికి బానిసై తరచూ నాగమ్మను వేదించేవాడు. మరో వైపు చెల్లెలని చూడకుండా వ్యవహరించే వాడు..దీంతో శివను హత్య చేసి ఇంట్లోనే పాతి పెట్టింది..
Published by:yveerash yveerash
First published: