Home /News /telangana /

తమ్ముడితో అక్క అఫైర్.. అతడి ఫ్రెండ్ తోనూ అక్రమబంధం.. చివరకు ఏం జరిగిందంటే..

తమ్ముడితో అక్క అఫైర్.. అతడి ఫ్రెండ్ తోనూ అక్రమబంధం.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తమ్ముడి వరుసయ్యే యువకుడితోనే ఓ యువతి అఫైర్ పెట్టుకుంది. అంతకుముుందు నుంచే ఆ తమ్ముడి స్నేహితుడితోనూ అక్రమ బంధాన్ని నడిపిస్తోంది. ఇద్దరు యువకులతోనూ ఆ యువతి నడుపుతున్న అసహజ బంధం చివరకు ఓ నేరానికి పురుగొల్పింది. అసలేం జరిగిందంటే..

  కామం వావీ వరుసలను చంపేస్తుందన్న మాట నిజమేనని ఇటీవల జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఓ విదేశీ వనిత, తనకు కొడుకు వరుసయ్యే వ్యక్తినే పెళ్లాడి ఓ బాబును కూడా కన్నదని ఇటీవల వార్తల్లో చదివే ఉంటారు. తాజాగా తెలుగు నేలపైనే ఓ ఘోరం వెలుగులోకి వచ్చింది. తమ్ముడి వరుసయ్యే యువకుడితోనే ఓ యువతి అఫైర్ పెట్టుకుంది. అంతకుముుందు నుంచే ఆ తమ్ముడి స్నేహితుడితోనూ అక్రమ బంధాన్ని నడిపిస్తోంది. ఇద్దరు యువకులతోనూ ఆ యువతి నడుపుతున్న అసహజ బంధం చివరకు ఓ నేరానికి పురుగొల్పింది. ఆ అక్కాతమ్ముడు కలిసి ఓ యువకుడిని కడతేర్చారు. అతడి శవాన్ని కెనాల్ లోకి తోసేశారు. ఆ యువకుడి మృతదేహం బయటపడటంతో, ఆ అక్కాతమ్ముళ్ల నీచం కూడా వెలుగులోకి వచ్చింది. వరంగల్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  వరంగల్ జిల్లా దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్ షిప్ కు చెందిన రెడ్డిమల్ల రాంకీకి కోమటి విజయ్ అనే స్నేహితుడు ఉన్నారు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగారు. రెడ్డిమల్ల రాంకీ పెదనాన్న కూతురు రెడ్డిమల్ల యామిని అప్పుడప్పుడు రాంకీ ఇంటికి వస్తుండేది. ఇదే క్రమంలో విజయ్ కూడా రాంకీ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుండేవాడు. అలా విజయ్, యామిని మధ్య పరిచయం మొదలయింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి విజయ్ కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. అయినప్పటికీ విజయ్, యామినిలు తమ మధ్య ఉన్న శారీరక బంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే యామిని వరుసకు తమ్ముడయిన రాంకీతోనూ అక్రమ బంధం పెట్టుకుంది. వరంగల్ డాక్టర్స్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మరీ వీరిద్దరూ తమ శారీరక వాంఛలను తీర్చుకునేవారు.

  ఏం జరిగిందో ఏమో కానీ, విజయ్ తో యామినికి చెడింది. విజయ్ అడ్డు తొలగించుకోవాలని ఆమె డిసైడయింది. దీంతో తమ్ముడిని ఆ దిశగా పురిగొల్పింది. తాను ప్రేమలో ఉన్నప్పుడు దిగిన ఫొటోలను విజయ్, తన స్నేహితులకు పంపిస్తున్నాడనీ, అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నాడని రాంకీతో యామిని చెప్పుకుంది. అతడి అడ్డు తొలగితేనే తమ బంధానికి ఇబ్బందులు రావని చెప్పింది. దీంతో రాంకీ అతడిని చంపేయాలని నిర్ణయానికి వచ్చేశాడు. యామిని సహకారంతో తన ప్లాన్ ను పూర్తి చేశాడు. జనవరి నాలుగో తారీఖున విజయ్ ను రాంకీ తన ఇంటికి పిలిచాడు. ఆ తర్వాత బయటకు వెళ్లారు. ఐదో తారీఖున గీసుకొండ శివారు కాకతీయ కెనాల్ వద్ద ఇద్దరూ కలిసి కల్లు తాగి ముచ్చట్లు చెప్పుకున్నారు.

  విజయ్ మత్తులో ఉన్నాడని గ్రహించిన రాంకీ అస్సలు ఆలస్యం చేయలేదు. విజయ్ ముఖంపై పిడిగుద్దులు గుద్ది, స్పృహ కోల్పేయేలా చేశాడు. ఆ తర్వాత అతడిని చంపేసి కెనాల్ లో పడేశాడు. ఈ నెల ఏడో తారీఖున వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కొత్తగూడెం శివారులోని కాకతీయ కెనాల్ లో మృతదేహం కొట్టుకు వచ్చింది. అది బయటపడటంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో తమ కుమారుడు కనిపించడం లేదని విజయ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్న మృతదేహాన్ని విజయ్ తల్లికి చూపించారు. అది తన కుమారుడిదే అని ఆమె గుర్తించింది. దీంతో అతడికి యామినితో ఉన్న ప్రేమ వ్యవహారం గురించి పోలీసులకకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తానికి రాంకీ, యామినిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Crime story, Husband kill wife, Lovers suicide, Wife kill husband

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు