మీకు సమస్యలుంటే నాకు చెప్పండి.. ప్రజలతో ఎస్పీ ముఖాముఖి..

సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక సరికొత్త ప్రయోగానికి తెర తీశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులందరితో కలిసి స్వయంగా తానే జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 18, 2019, 3:16 PM IST
మీకు సమస్యలుంటే నాకు చెప్పండి.. ప్రజలతో ఎస్పీ ముఖాముఖి..
సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే
  • Share this:
తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ మరింతగా ఉన్నతంగా మారుతోంది. ఇప్పటి వరకు ప్రజల సమస్యలను వినడానికి రాజకీయ నాయకులు, అధికారులు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వస్తున్నారు. అయితే, తొలిసారిగా సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక సరికొత్త ప్రయోగానికి తెర తీశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులందరితో కలిసి స్వయంగా తానే జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. జిల్లాలో ఎవరికైనా చట్ట పరమైన సమస్యలు ఉన్నా, ఏవైనా కేసుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్వయంగా ఈ నెల 24న జిల్లా ఎస్పీ కార్యాలయంలో తనను సంప్రదించవచ్చని తెలిపారు. ఆ రోజు జిల్లా పోలీసులందరూ ఎస్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని, బాధితులకు సంబంధించిన సమస్యను సంబంధిత స్టేషన్ పరిధిలోని ఎస్‌హెచ్‌వో సమక్షంలో అక్కడికక్కడే పరిష్కారం చేయటానికి ప్రయత్నిస్తామని చెప్పారు.

ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ మంగళవారం రోజు ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను, వినతులను స్వీకరించి, వాటిని అక్కడిక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి చట్టపరమైన, భద్రతాపరమైన సమస్యలు ఉంటే ఎలాంటి భయం లేకుండా చెప్పుకోవచ్చని సూచించారు.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>