కంది రైతులు ఆందోళన చెందవద్దు...మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కంది దిగుబడిపై వ్యవసాయశాఖ వద్ద సమగ్ర సమాచారం ఉందని, దళారుల అక్రమంగా తెచ్చి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

news18-telugu
Updated: February 17, 2020, 10:57 PM IST
కంది రైతులు ఆందోళన చెందవద్దు...మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి
  • Share this:
కంది పండించిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాష్ర్ట ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. కంది రైతుల సమస్యను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లగా కొనుగోళ్లకు అభయం ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. కంది కొనుగోళ్లకు దాదాపు రూ.200 కోట్లు అదనంగా ప్రభుత్వంపై భారం పడుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో సోమవారం ఎంఎల్‌ఎ బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, మార్క్‌ఫెడ్ ఎం.డి భాస్కరాచారి, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ ఛైైర్మన్ బండారు భాస్కర్‌లతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి మీడియాత మాట్లాడారు. కంది కొనుగోలు కోటాను పెంచాలని లేఖ రాసినా కేంద్రం స్పందించలేదని చెప్పారు. రూ.5,800 క్వింటాల్ చొప్పున 47,500 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు నాఫెడ్ అనుమతిచ్చినట్లు తెలిపారు. కంది దిగుబడిపై వ్యవసాయశాఖ వద్ద సమగ్ర సమాచారం ఉందని, దళారుల అక్రమంగా తెచ్చి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళారులకు అధికారులు సహకరిస్తే జైలుకు పంపిస్తామన్నారు. సరిహద్దు రాష్ట్రాల వద్ద నిఘా పెంచాలని, ఇతర రాష్ట్రాల కందులు తెలంగాణలోని మార్కెట్లకు రావొద్దని మంత్రి ఆదేశించారు.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని రోజూ కేంద్రం ప్రగల్బాలు చెబుతుందని ఎద్దేవా చేశారు. విదేశీ మారకద్రవ్యం పెంచుకునే పసుపు పంటకు బోర్డు ఏర్పాటులోనూ నిర్లక్ష్యంగా వ్యహరిస్తుందని విమర్శించారు. మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమావేశంలో మీడియాతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరయిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి , మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి, మార్క్ ఫెడ్ ఎండీ భాస్కరాచారి, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ చైర్మన్ బండారు భాస్కర్ హాజరయ్యారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు