Home /News /telangana /

SINGARENI WORKERS GAVE NOTICE TO STRIKE AGAINST PRIVATISATION VRY

Singareni strike : సింగరేణిలో సమ్మె నోటిస్.. ప్రైవేటికరణకు వ్యతిరేకంగా సమ్మె

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Singareni strike : లాభాల బాటలో ఉన్న సింగరేణిలో కార్మికులు సమ్మె సరైన్ మోగించారు. గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అధికార సంఘం సింగరేణి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.

    సింగరేణి బొగ్గు గనుల్లోని బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘం సమ్మె సైరన్​ మోగించింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) సమ్మె నోటీసిచ్చింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని.. ఆ నాలుగు బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని కార్మికులు డిమాండ్​ చేశారు. ( Singareni workers strike against privatisation)

    ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్‌ 9 నుంచి సమ్మె చేపట్టాలని టీబీజీకేఎస్​ నిర్ణయం తీసుకుంది. కోల్‌ ఇండియాలోని 89 బ్లాకులతో పాటు సింగరేణి (Singareni workers strike against privatisation) లోని నాలుగు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కాగా ప్రైవేటీకరణతో కార్మికులకు రావాల్సిన వారసత్వ ఉద్యోగాల్లో కోత, లాభాల్లో వాటాలు కూడా కనుమరుగవుతాయని యూనియన్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

    ఇది చదవండి : ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట.. ఫిదా అయిన ఎండీ సజ్జనార్..కానుకగా..


    పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని యైటింక్లైన్ కాలనీలో జరిగిన కేంద్రకమిటీ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో ఆదిలాబాద్‌, పెద్దపల్లి, భూపాలపల్లి తదితర జిల్లాల కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్​ అధ్యక్షుడు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

    ఇది చదవండి : ముగిసిన విత్ డ్రా సమయం.. సగం స్థానాల్లో అభ్యర్థుల ఏకగ్రీవం

    Published by:yveerash yveerash
    First published:

    Tags: Singareni, Telangana

    తదుపరి వార్తలు