• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • SINGARENI UNION LEADERS SEXUAL HARASSMENT WITH EMPLOYEE WIFE AUDIO GOES VIRAL BA KMM

Singareni: కలలోకొచ్చి పరేషాన్ చేస్తున్నవ్.. ఇంటికొచ్చేసెయ్.. కార్మికుడి భార్యతో సింగరేణిలో కార్మికనేత.. ఆడియో వైరల్

ప్రతీకాత్మక చిత్రం

సింగరేణి కాలరీస్ ఇల్లందు ఏరియా పరిధిలోని కోయగూడెం ఓసీలో పనిచేస్తున్న ఓ కార్మికుడి భార్యను తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఇల్లందు బ్రాంచ్ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు కొద్దికాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.

  • Share this:
    (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్‌18)

    సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన కార్మికసంఘం నేతే ఓకార్మికుడి కుటుంబానికి సమస్యగా మారాడు. ఏకంగా కార్మికుడి భార్యపైనే కన్నెశాడు. సింగరేణి కాలరీస్ ఇల్లందు ఏరియా పరిధిలోని కోయగూడెం ఓసీలో పనిచేస్తున్న ఓ కార్మికుడి భార్యను తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఇల్లందు బ్రాంచ్ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు కొద్దికాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తరచూ ఫోన్ చేస్తూ.. అసభ్యకర సైగలు చేస్తూ వెకిలి చేష్టలకు పాల్పడుతున్నాడు. నిందితుడి వేధింపులు తాళలేని బాధితురాలు తెలివిగా అతడికే ఫోన్ చేసి వాయిస్ రికార్డ్ చేసింది. ఆధారాలతో సహా ఇల్లందు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిపై కేసు నమోదు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అండదండలు ఉన్న గుర్తింపు సంఘం నేత కావడంతోనే పోలీసులు కేసు నమోదు చేయడంలేదని తెలుస్తోంది. అయితే ఇకపై వేధింపులకు పాల్పడబోనని సదరు కార్మికసంఘం నేత లిఖితపూర్వకంగా రాసివ్వడంతో విషయం సద్దుమణిగినట్లు తెలుస్తోంది.

    ఇదిలా ఉంటే మహిళలపై వేధింపులు‌, దాడులు అధికమవ్వుతున్న తరుణంలోనూ కొందరు మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులిస్తున్నా పోలీసు స్టేషన్లలో సరైన న్యాయం జరగడం లేదని మహిళాసంఘాలు ఆరోపిస్తున్నాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేయకుండా పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టడమేంటంటూ ప్రశ్నిస్తున్నాయి. పై ఘటనపై స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ బర్పటి రమేష్ ను సంప్రదించగా మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయబోతున్నట్లు తెలిపారు.

    అయితే ఈ ఫోన్ కాల్ మాట్లాడిన సందర్భంలో సదరు కార్మిక నాయకుడు ఫోన్ రికార్డ్ చేస్తున్నవా అంటూ పదే పదే ప్రశ్నించడం.. ఒట్టుబెట్టంటూ గారాలు పోవడం.. రాత్రికి ఇంటికి రమ్మంటూ ఆమెను పదేపదే ప్రేరేపించడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వేళ అధికార పార్టీకి ఇలాంటి ఘటనలు తలనొప్పిగా మారాయి. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించాల్సిన నాయకుడే సాటి కార్మికుని భార్యపై కన్నేయడం.. ఆమెను వేధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: