Singareni Employees: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. ఆ ఉత్తర్వులు జారీచేసిన సింగరేణి యాజమాన్యం

సింగరేణి కార్మికులు(ఫైల్ ఫొటో)

Good News to Singareni Employees: సింగరేణి ఉద్యోగులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. సింగరేణి యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులతో.. కంపెనీలో పనిచేస్తున్న 43, 899 మందికి ప్రయోజనం చేకూరనుంది.

  • Share this:
    సింగరేణి ఉద్యోగులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. సింగరేణిలో ఉద్యోగులు, కార్మికుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి సింగరేణి అధికారులు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది మార్చి 31 నుంచి రిటైర్‌ అయిన అందరికీ ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఈ నెల 31లోగా విధుల్లో చేరాలని చెప్పారు. దీంతో మార్చి 31 నుంచి రిటైర్‌ అయిన 1,082 మంది ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరేందుకు అవకాశం కల్పించినట్టయింది. ఒకవేళ రిటైర్డ్ అయిన ఉద్యోగులు, కార్మికులు.. నిర్ణీత గడువులోగా విధుల్లో చేరని పక్షంలో తిరిగి విధుల్లో చేరే అవకాశం ఉండదని తెలిపారు. విరమణ పొందిన తేదీ నుంచి తిరిగి విధుల్లో చేరే తేదీ మధ్య కాలాన్ని నో వర్క్‌ నో పేగా పరిగణించనున్నారు.

    ఆ కాలాన్ని కంపెనీ సర్వీసుగానే గుర్తిస్తారు. విరమణ పొంది తిరిగి విధుల్లో చేరే వారి పింఛన్‌ను నిలుపుదల చేసేలా సీఎంపీఎఫ్‌ అధికారులను సింగరేణి కోరనుంది. ఇదిలా ఉంటే పదవీ విమరణ వయసు పెంపుతో సింగరేణిలో పనిచేస్తున్న 43, 899 మందికి ప్రయోజనం చేకూరనుంది.

    ఇక, సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు, ఇతరత్రా అంశాలు, వాటి పరిష్కారాలపై గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కార్మిక సంఘాలు, ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు పదవీ విరమణ వయసు 61ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. బోర్డు సమావేశంలో దీనిపై సమీక్షించి పెంపు అమలు తేదీని ప్రకటించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సింగరేణి యాజమాన్యం.. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
    Published by:Sumanth Kanukula
    First published: