Home /News /telangana /

SINGARENI EMPLOYEE CHEATED BY BELIEVING THAT HE WILL MARRY HIS GIRLFRIEND IN BADRADRIKORRAGUDEM BN

రైలులో పరిచయం.. అది కాస్త ప్రేమగా మారి.. చివరకు పోలీసు స్టేషన్‌కు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌కు రైలులో వెళ్లి వచ్చే సమయంలో మణుగూరుకు చెందిన సింగరేణి ఉద్యోగి కొట్టే వివేకానందతో ఐదు నెలల క్రితం పరిచయం అయ్యింది. కొద్ది రోజులకే ఆ పరిచయం కాస్త ప్రేమపుంతలు తొక్కింది.

    ప్రేమ.. అదో మధురానుభూతి. దాదాపు ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఎవరితోనో.. ఒకరితో ప్రేమల పడుతారంటుంటారు. ఎవరితో ఎందుకు ఏ సమయంలో ప్రేమలో పడతామనేది చెప్పలేం. ప్రేమకు పేద, ధనిక అనే తారతమ్యాలు ఉండవంటారు. తమ ప్రేమను గెలిపించుకునేందుకు కొంతమంది పోరాటాలు సైతం చేస్తుంటారు. కానీ మరికొంత మంది అదే సమయంలో ప్రేమ పేరుతో మోసం చేసి తమ కామవాంఛను తీర్చుకుంటుంటారు. ఇలాంటి కోవలోకి చెందినదే ఈ ప్రేమ వ్యవహారం కూడా. రైలులో పరిచయమై.. అది కాస్త ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కామవాంఛ తీర్చుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోవాలనే సరికి మొహం చాటేశాడు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతలబోరు గ్రామానికి చెందిన కొలేటి ప్రియాంక నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది.

    హైదరాబాద్‌కు రైలులో వెళ్లి వచ్చే సమయంలో మణుగూరుకు చెందిన సింగరేణి ఉద్యోగి కొట్టే వివేకానందతో ఐదు నెలల క్రితం పరిచయం అయ్యింది. కొద్ది రోజులకే ఆ పరిచయం కాస్త ప్రేమపుంతలు తొక్కింది. దీన్ని సాకుగా తీసుకున్న వివేకానంద పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కామవాంఛను తీర్చుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోమని ప్రియాంక అడిగేసరికి మొహం చాటేశాడు. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మోసం చేశాడంటూ ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Badradri, Fraud, Lovers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు