SCCL: ఒకే రోజు 2 లక్షల మొక్కలు నాటేందుకు సిద్దమైన సింగరేణి.. ఏ రోజంటే..

ప్రతీకాత్మక చిత్రం

సింగరేణి సంస్థ ప్రతి ఏడాది హరితహారంలో కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న సంగతి తెలిసిందే.

  • Share this:
    సింగరేణి సంస్థ ప్రతి ఏడాది హరితహారంలో కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమంలోనే భాగంగా భారీ సంఖ్యలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17వ తేదీన ఒక్క రోజే 2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి సింగరేణి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు సింగరేణి కంపెనీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్(ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్(ఫైనాన్స్) ఎన్ బలరాం, ప్రాజెక్ట్ డైరెక్టర్ డీ సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ గొప్ప కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగులు, సిబ్బంది అంతా పాల్గొనాలని సంస్థ అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు.

    ఇందుకోసం సింగరేణి సంస్థ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. రీజియన్ల వారిగా నాటాల్సిన మొక్కల సంఖ్యను నిర్దేశించింది. మొక్కలు నాటడంతో పాటుగా వాటిని పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలని యాజమాన్యం అధికారులు, సిబ్బందిని కోరింది. తమ సంస్థ 2015 నుంచి హరితహారం కార్యక్రమంలో భాగంగా 4.59 కోట్ల మొక్కలు నాటిందని సింగరేణి యాజమాన్యం పత్రిక ప్రకటనలో పేర్కొంది.

    ఇక, ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటేందుకు రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు, పలు రంగాల ప్రముఖలు సిద్దమవుతున్నారు. ఒక్క రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించి, హరిత ప్రేమికుడైన కేసీయార్ కు పుట్టినరోజు బహుమతిగా ఇవ్వాలనేది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంకల్పం అని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్ తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: