Home /News /telangana /

Singareni : ఈనెల 9 నుంచి సింగరేణిలో సమ్మె -చర్చలు విఫలం, cm kcrకు కార్మిక సంఘాల డెడ్‌లైన్

Singareni : ఈనెల 9 నుంచి సింగరేణిలో సమ్మె -చర్చలు విఫలం, cm kcrకు కార్మిక సంఘాల డెడ్‌లైన్

సింగరేణిలో సమ్మె సైరన్

సింగరేణిలో సమ్మె సైరన్

సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు యజమాన్యం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోన్న కార్మిక సంఘాలు.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె బాట పట్టాయి. ఈనెల 9 నుంచి మూడు రోజులపాటు 72 గంటల సంపూర్ణ సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ విషయంలో సింగరేణి యాజమన్యంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

ఇంకా చదవండి ...
తెలంగాణ వరదాయిని సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు యజమాన్యం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోన్న కార్మిక సంఘాలు.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె బాట పట్టాయి. ఈనెల 9 నుంచి మూడు రోజులపాటు 72 గంటల సంపూర్ణ సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ విషయంలో సింగరేణి యాజమన్యంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. హైదరాబాద్ వేదికగా రీజినల్ లేబర్ కమిషనర్ సమక్షంలో సోమవారం మరోసారి జరిగిన చర్చలు కూడా ఫెయిలయ్యాయి. దీంతో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) తెలిపింది. కాగా, ఈనెల 8లోపు సీఎం కేసీఆర్ గనుక అపాయింట్మెంట్ ఇచ్చి చర్చలకు పిలిస్తే సమ్మెపై ఆయనకు వివరిస్తామని, పిలవకుంటే సమ్మెపై ముందుకే వెళతామని నేతలు చెబుతున్నారు. వివరాలివి..

హైదరాబాద్‌లోని రీజినల్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు సోమవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో పాట కార్మికుల ప్రధాన డిమాండ్లపై ఆర్‌ఎల్‌సీ, సింగరేణి అధికారులతో జేఏసీ నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే ఇవ్వాలని, ప్రైవేటు కాంట్రాక్టర్లకు వద్దని, అలాగే ఇతర 12 డిమాండ్ల పై చర్చించడానికి చొరవ చూపాలని కార్మిక నేతలు కోరగా, యాజమాన్యం సానుకూలంగా స్పందించలేదు. దీంతో చర్చలు విఫలమైనట్లుగానే కార్మికులు భావిస్తున్నారు. తద్వారా ముందు ప్రకటించిన తేదీల్లో సమ్మె కొనసాగిస్తామంటున్నారు..

etela rajenderపై ప్రతీకారం.. టీఆర్ఎస్‌ క్లర్కుగా కలెక్టర్ హరీశ్.. cm kcrపైనా జమున ఫైర్సింగరేణిని ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవడానికి ఈనెల 9, 10, 11 తేదీల్లో 72గంటలపాటు నిరవధికంగా సంపూర్ణ సమ్మె చేపడతామని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించడం తెలిసిందే. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని, ఆ నాలుగు బొగ్గు బ్లాకులూ సింగరేణికే దక్కేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని జేఏసీ కోరుతున్నది. ఈనెల 8లోపు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తే డిమాండ్లపై మాట్లడుతామని, లేదంటే 9 నుంచి తలపెట్టిన సమ్మె యథావిథిగా కొనసాగుతుందని కార్మికులు చెప్పారు. కార్మిక సంఘాల జేఏసీలో ఏఐటీయూసీ, ఐఏన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, టీజీబీకేఎస్ నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్, నరసింహారావు, రియాజ్ అహ్మద్, మిరియాల రాజిరెడ్డి, సత్తయ్య, టి.రాజిరెడ్డి తదితరులున్నారు. మరోవైపు,

Omicron : ఒమిక్రాన్ వల్ల భారత్‌లో కరోనా మూడో వేవ్ -రోజుకు 1.5లక్షల కేసులు రాబోతున్నాయ్ : సైంటిస్టుల వార్నింగ్సింగరేణిలో సమ్మె విషయమై ఓవైపు యాజమాన్యం సంబంధిత అధికారులను కలుస్తూనే, సీఎంవోతోనూ మాట్లాడేందుకు కార్మిక సంఘాల జేఏసీ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు, రాజకీయంగానూ సమ్మెకు మద్దతు కోసం వివిధ పార్టీల నేతలను కలవాలని జేఏసీ నిర్ణయించుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర పార్టీల నేతలను జేఏసీ కలవబోతోందని సమాచారం. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల బిడ్‌లకు సంబంధించి హైదరాబాద్‌లోని బిడ్‌ కాంట్రాక్టుకు చెందిన కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించే దిశగానూ జేఏసీ నేతలు కార్యాచరణ రూపొందించారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Singareni, Singareni Collieries Company, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు