ఓ వ్యక్తి పొలం దున్నతుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. వాటిని గుట్టు చప్పుడు కాకుండా కొంతమంది ఇంటికి పట్టుకెళ్లారు. కానీ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసుల వరకు చేరింది. దీంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని ఎల్మకన్నెలో వెండి నాణేలు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన సహకార సంఘం డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి తన పొలాన్ని దున్నిస్తున్నాడు. ఆ సమయంలో వెండి నాణేలు బయటపడ్డాయి. దీంతో ఆ నాణేలను అతడితో పాటు అక్కడే ఉన్న మరికొంతమంది తీసుకెళ్లారు. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వారి నుంచి 141 వెండి నాణేలను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.