అదిలాబాద్ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్ బాధ్యతల స్వీకరణ

అదిలాబాద్ నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న సిక్తా పట్నాయక్

ఆదిలాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బదిలీపై వెళుతున్న ఎ.శ్రీదేవసేన నుంచి బాధ్యతలను స్వీకరించారు.

  • Share this:
    ముచ్చటగా మూడోసారి మహిళా కలెక్టర్ ఆదిలాబాద్ జిల్లా పాలనా పగ్గాలను చేతబట్టారు. ఆదిలాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసి పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలిగా బదిలీపై వెళుతున్న ఎ.శ్రీదేవసేన నుంచి కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు. అయితే ఇప్పటి వరకు కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన శ్రీదేవసేన కూడా పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ఆదిలాబాద్ కలెక్టర్‌గా బదిలీపై రావడం విశేషం. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించి ఆదిలాబాద్‌కు తొలికలెక్టర్‌గా జ్యోతి బుద్ద ప్రకాశ్‌ను నియమించింది.

    రెండేళ్ల తర్వాత ఆదిలాబాద్ కలెక్టర్‌గా దివ్య దేవరాజన్‌ను నియమించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆమెను బదిలీ చేసిన ప్రభుత్వం... శ్రీదేవసేనను ఆదిలాబాద్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఫిబ్రవరి 3న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీదేవసేన ఐదున్నర నెలలపాటు పనిచేశారు. తాజాగా ప్రభుత్వం ఈమెను పాఠశాల విద్య సంచాలకురాలిగా బదిలీ చేసి, ఆమె స్థానంలో పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను నియమించింది. సిక్తా పట్నాయక్ ఈ రోజూ శ్రీదేవసేన నుండి బాధ్యతలను స్వీకరించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: