SIDDIPETA GOVERNMENT DEGREE COLLEGES TEACHERS ARE IMPARTING SELF EMPLOYMENT TRAINING TO STUDENTS ALONG WITH EDUCATION SNR MDK
Siddipeta : అక్కడ డిగ్రీ కాలేజీలో చదివితే చాలు .. ఆ తర్వాత చదువు ఆపేసినా ఢోకా ఉండదట
(విద్య, స్వయం ఉపాధి)
Siddipeta: అక్కడి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు విద్యార్ధులకు చదువుతో పాటు బ్రతకడానికి అవసరమయ్యే ఉపాధి మార్గాలను చూపిస్తున్నారు. డిగ్రీ విద్యతో సరిపెట్టుకొని జీవితంలో స్థిరపడాలనుకునే స్టూడెంట్స్‌కి స్వయం ఉపాధి శిక్షణలో మెళకువలు నేర్పిస్తున్నారు. ఎవరిపై ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సహిస్తున్నారు.
(K.Veeranna,News18,Medak)
అక్కడి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు విద్యార్ధులకు చదువుతో పాటు బ్రతకడానికి అవసరమయ్యే ఉపాధి మార్గాలను చూపిస్తున్నారు. డిగ్రీ విద్యతో సరిపెట్టుకొని జీవితంలో స్థిరపడాలనుకునే స్టూడెంట్స్‌కి స్వయం ఉపాధి శిక్షణలో మెళకువలు నేర్పిస్తున్నారు. ఎవరిపై ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సహిస్తున్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ తరహా సౌకర్యం విద్యార్దులందరికి కల్పిస్తున్నారు అధ్యాపకులు. తెలంగాణలో ప్రభుత్వ కాలేజీల స్వరూపం మారిపోతోంది. ముఖ్యంగా సిద్దిపేట(Siddipeta)జిల్లా కేంద్రంలోని స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ(Govt Degree College)అన్నీ విధాలుగా గొప్ప పేరు తెచ్చుకుంటోంది. ఈ కాలేజీలో సుమారు 400మందికిపైగా విద్యార్ధులు డిగ్రీ(Degree), పీజీ(PG) చదువుతున్నారు. డిగ్రీ విద్యార్ధులకు నాణ్యమైన విద్యను భోదిస్తూనే స్వయం ఉపాధి పొందే విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు కాలేజీ అధ్యాపకులు. ముఖ్యంగా మత్స్యశాస్త్ర విభాగం ఆధ్వర్వంలో ఆక్వేరియం(Aquarium)తయారి, చేపల పెంపకంపై మెళకువలు, ఆహార ఉత్పత్తులను ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నారు.
ఎల్ఈడీ బల్బుల తయారీపై శిక్షణ..
ఇక భౌతికశాస్త్రం ఆధ్వర్యంలో ఎల్ఈడీ బల్బులు, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నేతృత్వంలో సబ్బులు, సర్ఫులు, శానిటైజర్స్‌తో పాటు గృహోపకరమైన రసాయన ద్రావణాల తయారు చేయడాన్ని నేర్పిస్తున్నారు. తెలుగు విభాగం ఆధ్వర్యంలో చాక్‌పీస్‌లు, అర్ధశాస్త్రం విభాగం నేతృత్వంలో ఆసక్తి ఉన్న వారికి కుట్టు శిక్షణ ఇస్తూ విద్యార్ధులకు భవిష్యత్తులో జీవనోపాధి పొందడానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా లైఫ్ స్కిల్స్, జాబ్స్ ప్రిపరేషన్ వంటి వాటిలో స్టూడెంట్స్‌కి తర్ఫీదు ఇస్తున్నారు.
విద్యార్ధులు ఎంతగానో ఉపయోగం..
సిద్దిపేటలోని డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్‌కి ఈ తరహా చదువుతో పాటు ఉపాధి కల్పనకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించడం, విద్యార్ధులకు నేర్పించడం వంటివి చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన అనుభవజ్ఞులైన ట్రైనర్లను ఆహ్వానిస్తున్నారు. విద్యార్ధులకు క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. ఈ స్వయం ఉపాధి పొందేందుకు ఇస్తున్న శిక్షణ తరగతులకు సుమారు వెయ్యి మందికిపైగా వినియోగించుకున్నారు.
ఇది చదవండి: కేటీఆర్ మాటలపై విశ్వబ్రాహ్మణులు గరం ..సారీ చెప్పకపోతే బాగోదంటూ వార్నింగ్
చదువుతో పాటు ఉపాధి..
చేతి ఖర్చులు, పాకెట్ మనీ కోసం స్టూడెంట్స్ సెలవు రోజుల్లో స్వయం ఉపాధి శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. డిగ్రీతోనే చదువు ఆపేయాలనుకునే వారికి ఇదో మంచి మార్గంగా మారుతోంది. స్టూడెంట్స్‌ని అద్యాపకులు కూడా ఆ దిశగానే కాలేజీ స్టడీ నుంచే సానబెడుతున్నారు. సిద్దిపేటలోనే కాదు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ తమ స్టూడెంట్స్‌ని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో వేలకు వేలు ఫీజులు కడితే స్టూడెంట్స్‌ని మార్కులు, ర్యాంకుల కోసం సానబెట్టినట్లుగా ఇక్కడ స్వయం ఉపాధి కోసం విద్యార్దులపై శ్రద్ధపెడుతున్నారు. భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తున్నారు.
ఇది చదవండి: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. మరో 1663 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు.. ఏ శాఖల్లో అంటే..
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.