అక్రమంగా రేషన్ బియ్యం సేకరించి (పీడీఎస్) పాలిష్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధంగా 250 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు శనివారం రాత్రి 9 గంటల సమయంలో సీజ్ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, వాటిని పాలిష్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు యత్నిస్తున్నారన్నా పక్కా సమాచారం మేరకు భూంపల్లి శివారులోని శివ రైస్‌మిల్లుపై టాస్క్‌ఫోర్స్ సీఐ ప్రసాద్, సీసీఐ సీఐ నరేశ్, సిబ్బంది నవీన్, నర్సింలు, శివకుమార్, రామ్, సాయి, అశోక్, అమృత్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 250 క్వింటాళ్ల రైస్‌ను గుర్తించి సీజ్ చేశారు. కేసును పోలీసులకు అప్పగించగా.. ఎస్‌ఐ సర్ధార్ జమాల్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ ప్రసాద్ మాట్లాడుతూ.. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది వ్యాపారస్తులు వారి నుండి అక్రమంగా కొనుగోలు చేసి, అట్టి బియ్యాన్ని పాలిష్ చేసి ఎక్కువ ధరకు మార్కెట్ డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వం రేషన్ బియ్యం కొనుగోలు చేసిన, మరియు ఇతరులు అమ్మిన, అక్రమంగా రవాణా చేసినా, పేద ప్రజల పొట్ట కొట్టి అక్రమ వ్యాపారం చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సీఐ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Illegal business, Ration Distribution, Ration Shop, Siddipeta, Task Force Police