సిద్దిపేట జిల్లాలో ఆస్తి పంచాక తండ్రిని పట్టించుకోని ముగ్గురు కొడుకుల అరెస్ట్...

ఆ తండ్రి ముగ్గురు కొడుకులకు ఒక్కొక్కరికి సుమారు రూ. కోటి చొప్పున ఆస్తులు పంచి ఇచ్చారు.

news18-telugu
Updated: August 5, 2020, 9:48 PM IST
సిద్దిపేట జిల్లాలో ఆస్తి పంచాక తండ్రిని పట్టించుకోని ముగ్గురు కొడుకుల అరెస్ట్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆస్తులు పంచి ఇచ్చిన తర్వాత కన్నతండ్రిని పట్టించుకోని ముగ్గురు కొడుకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శనిగరం మధిర గ్రామమైన శంకర్ నగర్ చెందిన పోతు మల్లయ్య (79) ఒక సంవత్సరం క్రితం తన ముగ్గురు కొడుకులు పోతు రవీందర్, పోతు జనార్ధన్, పోతు రవీందర్ (45) ఒక్కొక్కరికి సుమారు రూ. కోటి చొప్పున ఆస్తులు పంచి ఇచ్చారు. ఆ తర్వాత ఎవ్వరూ కూడా తండ్రిని పోషించడానికి ముందుకు రాలేదు. గ్రామ పెద్దలు రెండుమూడుసార్లు పంచాయతీ చెప్పినా మేము పోషించమని కరాఖండీగా చెప్పేశారు. వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి తండ్రిని మంచిగా చూసుకుని పట్టెడన్నం పెట్టాలని రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ నిర్వహించినా వారు ముందుకు రాలేదు. ఈ విషయమై తండ్రి మల్లయ్య హుస్నాబాద్ ఆర్డీవో దగ్గరికి వెళ్లి తన కొడుకులు తన ఆస్తి తీసుకుని తనను పోషించడం లేదని ఫిర్యాదు చేయగా ఆర్డీఓ కూడా కౌన్సెలింగ్ నిర్వహించారు. కానీ, తాము అతన్ని పోషించమని తెగేసి చెప్పారు. ఈ క్రమంలో మల్లయ్య గత సంవత్సరం నుంచి గ్రామస్తులు, ఇరుగు పొరుగు వారు పెట్టిన అన్నం తింటూ బ్రతికాడు. గ్రామ పెద్దలు, కోహెడ ఎస్ఐ రాజకుమార్ కలసి చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపల్లి వృద్ధాశ్రమంలో చేర్పించారు.

గత నెల రోజుల నుండి వృద్ధాశ్రమంలో ఉంటుండగా మల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. నాలుగు రోజుల క్రితం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడని ఎస్ఐ మల్లయ్య ముగ్గురు కొడుకులకు సమాచారం అందించగా ఎవ్వరూ ఆస్పత్రికి వచ్చి తండ్రిని చూడలేదు. ఈ విషయం గురించి గ్రామ వీఆర్వో దరఖాస్తు ఇవ్వగా ఎస్ఐ రాజకుమార్ కేసు నమోదు చేసి పరిశోధన చేశారు. ఈ రోజు ముగ్గురు కొడుకులను అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కని, పెంచిన తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క కొడుకు పై ఉంటుందని, మన జన్మకు కారణమైన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకొని వారిపై, పోషించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 5, 2020, 9:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading