హోమ్ /వార్తలు /telangana /

మొక్కే కదా అని పీకేశాడు.. రూ. 30వేలు ఫైన్ కట్టాడు..

మొక్కే కదా అని పీకేశాడు.. రూ. 30వేలు ఫైన్ కట్టాడు..

ఆ విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి వెళ్లింది. హరితహారం మొక్కలను నరకడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు..బాలయ్యకు జరిమానా విధించారు.

    తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టి మొక్కలు నాటిస్తోంది. కేవలం మొక్కలు నాటి చేతులు దులుపుకోవడమే కాదు..వాటి సంరక్షణ బాధ్యతలను కూడా అధికారులకు అప్పగించింది. ఐతే కొన్ని చోట్ల హరిత హారం మొక్కలను స్థానికులు తమ స్వార్థం కోసం ధ్వంసం చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల మేకలు, పశువులు మొక్కలను మేస్తున్నాయి. ఐతే ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. తాజాగా సిద్దిపేటలో ఓ వ్యక్తికి రూ.30వేల జరిమానా విధించారు.

    సిద్దిపేట పట్టణంలోని బృందావన కాలనీ ఎదురుగా ఉన్న హరితహారం చెట్లను అదే కాలనీకి చెందిన బాలయ్య అనే ధ్వంసం చేశాడు. ఆ విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి వెళ్లింది. హరితహారం మొక్కలను నరకడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు..బాలయ్యకు జరిమానా విధించారు. కౌన్సిలర్ మల్లిఖార్జున్‌తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 30 చెట్లను నరికినందుకు బాలయ్యకు ఏకంగా రూ.30వేల జరిమానా విధించారు. అంతేకాదు అతనితో మళ్లీ 30 మొక్కలు నాటించి.. ఏడాది పాటు సంరక్షణ బాధ్యతలను అప్పగించారు.

    First published:

    ఉత్తమ కథలు