Home /News /telangana /

SIDDIPET FORMER COLLECTOR VENKATRAM REDDY BECAME TRS MLC A DAY AFTER RESIGNATION CM KCR PAYS DIFFERENT CARDS IN MLC ELECTIONS MKS

TRS : నిన్న జిల్లా కలెక్టర్.. నేడు ఎమ్మెల్సీ : వెంకట్రామిరెడ్డికి cm kcr బంపరాఫర్

వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ ఆశీర్వాదం(పాత ఫొటో)

వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ ఆశీర్వాదం(పాత ఫొటో)

సిద్దిపేట జిల్లా కలెక్టర్ పదవికి రాజీనామా చేసున్నట్లు సోమవారం నాడు ప్రకటించిన వెంకట్రామిరెడ్డి.. అధికారికంగా టీఆర్ఎస్ లో చేరకుండానే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిపోయారు. మరోవైపు, రాజ్యసభ సిట్టింగ్ ఎంపీ బండ ప్రకాశ్ ను సైతం ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. ఈ ఇద్దరినీ మంత్రివర్గంలోకి కూడా తీసుకోబున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి..

ఇంకా చదవండి ...
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు (mlc elections) వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార టీఆర్ఎస్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా సంచలనాలకు కేంద్ర బిందువైంది. సిట్టింగ్ ఎంపీ బండ ప్రకాశ్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి అందరినీ షాక్ కు గురిచేసిన సీఎం కేసీఆర్ (CM KCR).. సిద్దిపేట జిల్లా కలెక్టర్ పదవికి రాజీనామాచేసిన వెంకట్రామిరెడ్డికి కూడా అవకాశం కల్పించారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ సంఖ్యాబలం పరంగా ఆరుగురి ఎన్నిక లాంఛనమే కాగా, 24 గంటల వ్యవధిలో జిల్లా కలెక్టర్ కాస్తా ఎమ్మెల్సీ అయిపోయిన అరుదైన దృశ్యం చోటుచేసుకుంది..

సిద్దిపేట జిల్లా కలెక్టర్ పదవికి రాజీనామా చేసున్నట్లు సోమవారం నాడు ప్రకటించిన వెంకట్రామిరెడ్డి.. అధికారికంగా టీఆర్ఎస్ లో చేరకుండానే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిపోయారు. నిజానికి ఆయనను గవర్నర్ కోటాలో మండలికి పంపుతారని ప్రచారం జరిగినా, దళిత నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ను కాదనిమరీ ఎమ్మెల్యే కోటాలోనే వెంకట్రామిరెడ్డికి అవకాశం కల్పించారు గులాబీ బాస్. ఎమ్మెల్సీ జాబితాలో వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాశ్ లతోపాటు గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, ఆకుల లలిత ఉన్నారు.

etela rajenderపై ప్రతీకారం! -cm kcr షాకింగ్ ట్విస్ట్ : సిట్టింగ్ ఎంపీకి ఎమ్మెల్సీ పదవి -trs mlc వీరే


ఎమ్మెల్యే కోటాలోని 6 ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీలు, గవర్నర్ కోటాలోని 1 ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసిన తర్వాత సీఎం కేసీఆర్.. తెలంగాణ మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయనున్నట్లు సమాచారం. కొత్తగా మంత్రివర్గంలోకి వెంకట్రామిరెడ్డిని, బండప్రకాశ్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వెంకట్రామరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం. 1996లో గ్రూప్‌-1 అధికారిగా ఎంపికైన ఆయన మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతిలలో ఆర్డీవోగా పనిచేశారు. 2007లో ఐఏఎస్‌ హోదా పొంది... మెదక్‌లో డ్వామా పీడీగా, హుడా సెక్రటరీగా, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌గా పనిచేశారు.

cm kcr : జాక్‌పాట్ కొట్టిన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి -దళిత నేత ఎర్రోళ్లకు మొండిచేయి - trs mlc లిస్టు ఇదే


తెలంగాణ ఆవిర్భావం ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు సర్వీసు ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆఫర్‌తో ఆయన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పటికీ వెంకట్రామిరెడ్డి కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ హాట్‌టాపిక్‌గా మారారు. దీంతో ఆయన టీఆర్ఎస్‌లో చేరనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 2018లో మల్కాజిగిరి లోక్‌సభ, 2020లో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగానూ ఆయన పేరును టీఆర్ఎస్ అధిష్ఠానం పరిశీలించింది. చివరికి ఎమ్మెల్యే కోటాలో ఆయన్ని ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపాలని నిర్ణయించింది.

Ravana : సీతమ్మను ఎత్తుకెళ్లిన రావణుడికి నిజంగా విమానం ఉంది! శ్రీలంక పరిశోధనకు భారత్ సహాయం -రావణాసురుడు తొలి ఏవియేటర్


కలెక్టర్‌ ఉద్యోగానికి సోమవారం నాడు రాజీనామా చేసిన చేసిన సందర్భంలో వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రావడం ఒక అదృష్టంమని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్‌ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని, రానున్న వందేళ్లు ప్రజలు చెప్పుకొనేలా.. దేశం మొత్తం చూసేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారని, ముఖ్యమంత్రి స్ఫూర్తి, దార్శనికత నన్ను ఎంతో ప్రభావితం చేశాయని, అందుకే టీఆర్ఎస్‌లో చేరి అభివృద్ధి పనుల్లో పాలుపంచుకోవాలనే వీఆర్‌ఎస్‌ నిర్ణయం తీసుకున్నానని, కేసీఆర్‌ ఏ పదవి ఇచ్చినా స్వీకరించి కష్టపడి పనిచేస్తానని వెంకట్రామిరెడ్డి చెప్పారు. సిద్దిపేట కలెక్టరేట్ భవనం ప్రారంబోత్సవం సందర్బంగా కలెక్టర్ హోదాలో వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కడం అప్పట్లో వివాదాస్పదమైంది.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Mlc elections, Siddipet, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు