హోమ్ /వార్తలు /తెలంగాణ /

Siddipet : ఆపదొస్తే చాలు సాయం అందిస్తారు .. సిద్దిపేట జిల్లాకు చెందిన ఆ నలుగురు అందరి వాళ్లు

Siddipet : ఆపదొస్తే చాలు సాయం అందిస్తారు .. సిద్దిపేట జిల్లాకు చెందిన ఆ నలుగురు అందరి వాళ్లు

( రోల్‌ మోడల్ యూత్)

( రోల్‌ మోడల్ యూత్)

Siddipet: పేదలకు సాయం చేయాలనే ఆలోచన ఉండాలే కాని..ప్రత్యక్షంగా చేయాల్సిన అవసరం లేదని యువకులు నిరూపించారు. సిద్దిపేటకు చెందిన నలుగురు సోషల్ మీడియా వేదికగా చేసుకొని సోషల్ సర్వీస్‌ చేస్తూ యువతకు రోల్‌మోడల్‌గా నిలిచారు.

(K.Veeranna,News18,Medak)

కమ్యూనికేషన్ వ్యవస్థ(Communication system) పెరిగి ప్రపంచమే కుగ్రామంగా మారడంతో ప్రజలు పక్కన వాళ్ల గురించి పట్టించుకునే తీరికి లేకుండా పోయింది. అలాంటిది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం(Software job) చేస్తున్న యువకులు స్వచ్ఛంద సేవ చేయడానికి పూనుకున్నారు. వయసులో ఉన్న యువకులు యూత్ క్లబ్ ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించడం, నాయకుల పుట్టిన రోజు వేడుకలు చేస్తున్న ఈరోజుల్లో కేవలం ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు సిద్దిపేట(Siddipet)జిల్లాకు చెందిన నలుగురు యువకులు ముందుకొచ్చారు. చేర్యాల(Cheryala)పట్టణానికి చెందిన బుక్క సతీశ్(Bukka Satish)(సాఫ్ట్‌వేర్ ఇంజనీర్), ఐతా రాము(Aita Ramu),తహీర్(Tahir),ఐతా శంకర్ (Aita Shankar)అనే నలుగురు యువకులు సోషల్ మీడియా ద్వారా ఇతరులకు సహాయం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

యువతకు స్పూర్తి...

ఉద్యోగాలు చేసుకుంటూనే నలుగురు యువకులు గత ఏడాది నుంచి పేదలు, అభాగ్యులకు సాయం చేయడం మొదలుపెట్టారు. సభ్యులు తమ సేవలను కేవలం చేర్యాల పట్టణం, మండలానికే పరిమితం చేయకుండా వేరే జిల్లాల్లో ఉండే వారికి సైతం తమకు తోచిన సాయం చేస్తున్నారు. యువకుల్లో చైతన్యం కోసం మార్పు రావాలంటూ అందరి దృష్టికి వచ్చినసమస్యలు తెలుసుకొని ఫలానా వారు ఆర్థికంగా సమస్య ఎదుర్కొంటున్నారని, వారికి తోచిన విధంగా సహాయం చేద్దామని వాట్సాప్ స్టేటస్, ఫేస్‌బుక్‌, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో గూగుల్‌పే, ఫోన్‌ పే నెంబర్లను పోస్టు చేస్తూ పరోక్షంగా ఉపకారం చేస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన సుమారు మూడున్నర లక్షల డబ్బును బాధితులకు అందజేశారు యువకులు.

సోషల్ మీడియా ద్వారా సోషల్ సర్వీస్..

చేర్యాల మండలంలోని మాసిరెడ్డిపల్లికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి రూ.5వేలతో గ్యాస్‌స్టౌవ్‌తో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ యువసేవకులు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన చిన్నపిల్లలు తండ్రిని కోల్పోవడంతో వారి పేరుతో 52వేల రూపాయలను పోస్ట్‌ ఆఫీస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. సిద్దిపేట జిల్లా జగదేవప్పూర్ చెందిన నిరు పేద కుటుంబానికి రూ.8వేలతో పాటు నిత్యావసర సరుకులు, కొమురవెల్లి మండలంలోని కిష్టపేటకు చెందిన ఓ యువకుడికి యాక్సిడెంట్ కావడంతో సర్జరీ కోసం రూ.40వేలు, ధూళిమిట్ట మండల కేంద్రానికి చెందిన ఓ పేద కుటుంబానికి రూ.10వేలు, చేర్యాల మండలంలోని కడవేర్గుకు చెంది చిన్నబాబు గుండె సర్జరీ నిమిత్తం రూ.70వేలు అందజేశారు.

ఇది చదవండి : నిజామాబాద్‌లో షాపింగ్‌మాల్ సిబ్బంది నిర్లక్ష్యం..మంచినీళ్లడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చాడు


ఉద్యోగాలు చేస్తూనే..

ఒకరేంటి...పదుల వందల సంఖ్యలో బాధితులకు సాయం చేశారు. ఇబ్బందులు గ్రహించి వారికి ఏవి అవసరమో వాటిని సమకూర్చుతున్నారు ఈ యువకులు. అటు చేర్యాల పట్టణానికి చెందిన పిల్లలు వారి తల్లిదండ్రులను కోల్పోవడంతో వారి పేరుమీద రూ.63వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. చేర్యాల మండలం వేచరేణికి చెందిన మహిళకు యాక్సిడెంట్ కావడంతో ఆపరేషన్ నిమిత్తం రూ.24,300, వీరన్నపేటకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌కు రోడ్డు ప్రమాదం జరగడంతో ఆయన సర్జరీ కోసం రూ.16వేలు అందజేశారు.   చేర్యాల ప్రగతి స్కూల్  చెందిన మల్లేశం అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడికి యాక్సిడెంట్ కావడంతో ఆయన సర్జరీ కోసం రూ.38,000, చేర్యాల పట్టణానికి చెందిన అల్లం సురేశ్ అనే యువకుడికి రోడ్డు ప్రమాదం కావడంతో సర్జరీ కోసం రూ.20వేలు అందజేశారు. చేర్యాలకు చెందిన దివ్యాంగులు తల్లిని కోల్పోవడంతో వారిని సంరక్షణ కేంద్రంలో చేర్పించారు.

అధికారుల దృష్టికి ప్రజాసమస్యలు..

గుంతలు పడిన రోడ్డు కారణంగా ప్రయాణాలకు ఇబ్బందిగా ఉంటుందని గుర్తించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ రోడ్డు ఫొటో తీసి అదనపు కలెక్టర్ ముజామ్మిలాను పోస్టు చేశాడు. దానిని గమనించిన అదనపు కలెక్టర్ రోడ్డు పై ఉన్న గుంతలు పూడ్చివేయించారు. అంతే కాదు కలెక్టర్ నుంచి మెసేజ్‌ రూపంలో రిప్లై రావడంతో తమ దృష్టికి వచ్చిన మరికొన్ని సమస్యలను కలెక్టర్‌తో షేర్ చేసుకున్నారు. జిల్లా అధికారులు సైతం ఈ యువకులు చేస్తున్న సహాయాన్ని అభినందిస్తూనే తాము కూడ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇది చదవండి: ఆ వేషం వేస్తూనే ప్రభుత్వ ఉద్యోగం కొట్టాడు .. పిట్టలదొరా మజాకా


First published:

Tags: Siddipeta, Software

ఉత్తమ కథలు