హోమ్ /వార్తలు /తెలంగాణ /

Siddipet: ‘మేం చచ్చిపోతాం నాయనా.. ఇక మా వల్ల కాదు’ అంటున్న సర్పంచులు

Siddipet: ‘మేం చచ్చిపోతాం నాయనా.. ఇక మా వల్ల కాదు’ అంటున్న సర్పంచులు

రాయపోల్ మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశం

రాయపోల్ మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశం

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీడీవో ముందు బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్న సర్పంచ్‌లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామాలను అభివృద్ధి చేస్తే తమకు ఇప్పటి వరకు బిల్లు రాలేదని అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...

  సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీడీవో ముందు బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్న సర్పంచ్‌లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామాలను అభివృద్ధి చేస్తే తమకు ఇప్పటి వరకు బిల్లు రాలేదని అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అప్పు తెచ్చి అభివృద్ధి చేశామని, ఇక తమ వల్ల కాదని.. ఆత్మహత్యలే శర్యణమని అధికారులకు నైరాశ్యంతో చెప్పారు. సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వెంకట నర్సింహారెడ్డి రెండు చేతుల జోడించి సర్పంచులు తరపున వేడుకున్నారు. ఎంపీడీవో రాజేష్ మాట్లాడుతూ బిల్లులు పెండింగ్ ఉంటే అతి త్వరలో పూర్తి చేస్తామని సర్పంచులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని బిల్లులు ఇస్తామని హామీ ఇచ్చారు.

  రాయపోల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వెంకట నర్సింహారెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్నామని చెప్పడమే తప్ప తమ సర్పంచులకు అభివృద్ధి చేసిన డబ్బులు ఇప్పటి వరకు రావడం లేదన్నారు. తమ తోటి సర్పంచు ఆత్మహత్యకు పాల్పడితే సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు వెంకట నర్సింహారెడ్డి వారికి ఆర్థికంగా సహాయం చేశానని కొందరు సర్పంచ్‌లు చెప్పారు. అప్పులు తెచ్చి రాయపోల్ మండలంలో 19 గ్రామాల్లో అభివృద్ధి చేశామని, డబ్బులు త్వరగా ఇప్పించాలని నర్సింహారెడ్డి కోరారు. దసరా పండుగకు సర్పంచులు బట్టలు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దసరా కంటే ముందు సర్పంచ్ భార్యాభర్తలిద్దరూ గొడవపడితే వాళ్లు బట్టలు కొనుక్కునేందుకు తాను డబ్బులు ఇచ్చానని మండల ఫోరం అధ్యక్షుడు వెంకట నర్సింహారెడ్డి న్యూస్18తో అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఎవరికీ చెప్పుకోలేక కుమిలి చస్తున్నామని, పేరుకు మాత్రమే సర్పంచ్ అని ఆవేదన వ్యక్తం చేశారు.

  ఇది కూడా చదవండి: Huzurabad : కేసీఆర్ ఓడితే ఈ అభ్యర్థే కారకుడవుతాడా? -ప్రచారం చేయకుండానే ఓట్లు -రాష్ట్రపతి రేసులోనూ..

  కారుపై సర్పంచ్ అని రాసుకుని, తెల్ల బట్టలు వేసుకుని తిరిగితే సర్పంచ్‌ల వద్ద ఎన్నో డబ్బులు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారని.. కానీ డబ్బులు లేకుండా తిరుగుతున్న విషయం వారికి తెలియదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నామని చెప్పినప్పటికీ గ్రామ పంచాయతీ ఖాతాలో పడకపోవడంతో సర్పంచులు తెచ్చిన అప్పులు తీర్చలేక భూములను అమ్ముకొని అధికార పార్టీలో కొనసాగుతున్నారని నర్సింహారెడ్డి తెలిపారు. అధికార పార్టీపై విమర్శిస్తే ఎక్కడి నుంచి ఒత్తిడి వస్తుందో అనే భయంలో సర్పంచ్లు ఉన్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇకనైనా సర్పంచ్‌ల ఆవేదనను అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని రాయపోల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వెంకట నర్సింహారెడ్డి విన్నవించుకున్నారు.

  News 18 ప్రతినిధి

  కె.వీరన్న

  మెదక్ జిల్లా

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Latest news, Medak, Siddipet, Telangana News

  ఉత్తమ కథలు