SIDDIPET DISTRICT DEVELOPED DRASTCALLY SAID MINISTER HARISH RAO VRY MDK
Harish rao : సిద్దిపేట దశ మారిపోయిందన్న మంత్రి హరీష్ రావు.. కారణం ఇదేనట.....
harish rao file photo
Harish rao :తెలంగాణ స్వరాష్ట్రం రాష్ట్రం ఏర్పడటంతోపాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో సిద్దిపేట దశ , దిశ మారిపోయిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు అన్నారు.. .
తెలంగాణ స్వరాష్ట్రం రాష్ట్రం ఏర్పడటంతోపాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో సిద్దిపేట దశ , దిశ మారిపోయిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు అన్నారు..సిద్దిపేట్లో నూతనంగా నిర్మించిన హరిత త్రీస్టార్ హోటల్‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలో ప్రజా అవసరాలు ఒక్కొక్కటిగా తీర్చుతున్నామని తెలిపారు . అన్ని రంగాల్లో గుణాత్మక మార్పులు సాధిస్తూ దేశానికే తలమానికంగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు .
శుక్రవారం సిద్దిపేట పట్టణం శివారు నాగులబండ వద్ద నూతనంగా నిర్మించిన హరిత త్రీ స్టార్ టూరిజం హోటల్ ను రాష్ట్ర ఆర్థిక , వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు .స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన మాదిరే తెలంగాణ రాష్ట్రం,సిద్దిపేట జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు . ఈ సంధర్భంగా సిద్దిపేట జిల్లా జాతీయ , రాష్ట్ర స్థాయిలో 33 అవార్డులను సొంతం చేసుకున్నదని గుర్తు చేశారు . కొత్తగా ప్రారంభించుకున్న హరిత త్రీ స్టార్ హోటల్ ఉత్తర తెలంగాణ నుంచి రాకపోకలు సాగించే వారికి ఉపయోగపడుతుందన్నారు . టూరిజం హోటల్ ప్రక్కనే వందలాది మందికి ఉపాధినిచ్చే ఐటీ టవర్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి అని తెలిపారు .
ఇక టూరిజం హోటల్ ముందు ఆక్సిజన్ పార్క్ 200 ఎకరాలలో విస్తరించి ఉండడంతోపాటు, IDOC, పోలీస్ కమిషనరేట్ ఇలా అనేక కార్యాలయాలు ఉన్నాయన్నారు .
విద్య , వైద్యం రంగాలలో మౌలిక సదుపాయాలు పెంపొందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు . భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని దుద్దేడను అభివృద్ధి చేసుకుంటున్నామని అని మంత్రి స్పష్టం చేశారు . రూ .100 కోట్లతో రంగనాయక సాగర్‌ను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు . నగర ప్రజలకు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు , శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామన్నారు . తమ పరిధిలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలను గుర్తించి దృష్టి లోపాల సవరణకు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కు సూచించారు.
స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆయన సూచించారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.