Home /News /telangana /

SHOCKING TRUTHS REVEALED BY WIFE IN HER HUSBAND MURDER CASE SHE SAID THAT I HAVE DONE GOOD JOB BY KILLING HIM HSN

నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి.. ఇంట్లోనే భర్తను పూడ్చిపెట్టిన చోట రోజూ నీళ్లు చల్లిన భార్య.. చంపి మంచి పనే చేశానంటూ కామెంట్స్

నౌసిన్ బేగం, గగన్ అగర్వాల్ (పెళ్లి నాటి ఫొటో)

నౌసిన్ బేగం, గగన్ అగర్వాల్ (పెళ్లి నాటి ఫొటో)

‘నా భర్తను చంపి నేను మంచి పనే చేశాను. నాకేం బాధగా కూడా లేదు. నా పిల్లలు అనాథలయ్యారన్న బాధ తప్పితే ఇంకేం బాధ లేదు.‘ అంటూ ఆ భార్య చెబుతున్న తీరును చూసి పోలీసులే విస్తుపోయారు.

  భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టిన రెండో భార్య కేసులో షాకింగ్ నిజాలు బయటికొస్తున్నాయి. ఆమె ఈ దారుణానికి పాల్పడటానికి అసలు కారణమేంటో ఆమె స్వయంగా పోలీసులకు వెల్లడించింది. ‘ నా భర్తను చంపి నేను మంచి పనే చేశాను. నాకేం బాధగా కూడా లేదు. నా పిల్లలు అనాథలయ్యారన్న బాధ తప్పితే ఇంకేం బాధ లేదు.‘ అంటూ ఆ భార్య చెబుతున్న తీరును చూసి పోలీసులే విస్తుపోయారు. హైదరాబాద్ లో రెండ్రోజుల క్రితం ‘భర్తను చంపి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన రెండో భార్య‘కు సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని పాతబస్తీ యాకత్ పురాకు చెందిన నౌసిన్ బేగం అనే 32 ఏళ్ల మహిళకు కొన్నాళ్ల క్రితమే పెళ్లయింది. నలుగురు కూతుళ్లు, ఓ కొడుకు కూడా ఉన్నారు. అయితే తరచూ భర్తతో గొడవలు అవుతుండటంతో అతడికి విడాకులు ఇచ్చింది.

  అయిదుగురు పిల్లలతో కలిసి వేరుగా ఉండటం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే గగన్ అగర్వాల్ అనే 38 ఏళ్ల వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు అతడు కూడా భార్యకు విడాకులు ఇచ్చి వేరుగా ఉంటున్నాడు. వీళ్లిద్దరూ గతేడాది జూన్ నెలలో ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నారు. అయిదుగురు పిల్లలతో సహా ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి వివేకానందనగర్ కాలనీలో కాపురం పెట్టారు. కొద్ది నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే గగన్ తీరులో క్రమేపీ మార్పులను గమనించసాగింది. మొదటి భర్త వల్ల కలిగిన నలుగురు కూతుళ్లలో ఇద్దరిపై వేధింపులు మొదలు పెట్టాడు. చివరకు తన ఆరేళ్ల కూతురుని కూడా వదలకుండా, ఆ పసిపాపతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఈ విషయంపైనే భర్తతో ఆమె తరచూ గొడవపడేది.
  ఇది కూడా చదవండి: సోదరుడి రూమ్ కు వెళ్లిన యువతి.. నిద్రలోంచి మెలకువ వచ్చి తిరిగి ఇంటికి.. రెండ్రోజుల తర్వాత వాట్సప్ లో వచ్చిన ఫొటోను చూసి..

  తరచూ తమ ఇంటికి వచ్చే సునీల్ అగర్వాల్ అనే వ్యక్తితో తన బాధను వెల్లబోసుకునేది. ఫిబ్రవరి 8వ తారీఖు రాత్రి గగన్, సునీల్ కలిసి ఇంట్లోనే మద్యం తాగారు. మద్యం మత్తులో గగన్, తన భార్య నౌషీమ్ తో గొడవపడ్డాడు. దీంతో అప్పటికే ఆమె పీకల్లోతు కోపంలో ఉండటంతో చంపేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇంట్లో ఉన్న కత్తిని అతడి గొంతులో దించింది. అక్కడికక్కడే పడిపోయిన అతడిపై పలుమార్లు దాడి చేసి చంపేసింది. అక్కడే ఉన్న సునీల్ ఈ దారుణాన్ని చూసి కంగుతిన్నాడు. ఆ తర్వాత గగన్ శవాన్ని మాయం చేసేందుకు నౌషీమ్ కు సహకరించాడు. ఇంట్లోనే సెప్టిక్ ట్యాంక్ నిర్మించడానికి ఓ పదిహేను రోజుల క్రితం గుంతను తవ్వినట్టు వారికి గుర్తుకు వచ్చింది. దీంతో ఆ మృతదేహాన్ని ఆ గుంతలో పూడ్చిపెట్టారు. రాళ్లు, కంకర, ఇటుకముక్కలు వేసి ఆ గుంతను పూడ్చిపెట్టింది. ఆ తర్వాత భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం పిల్లలతో సహా తన పుట్టింటికి వెళ్లిపోయింది.
  ఇది కూడా చదవండి: ఇంట్లో నా భర్త నిద్రపోతున్నాడని చెప్పినా బలవంతం చేయడంతో.. ప్రియుడిని లోపలికి రానిచ్చిన భార్య.. ఆ తర్వాత..

  అయితే పుట్టింటికి వెళ్లినప్పటికీ నౌషీమ్ రోజూ తన ఇంటికి వచ్చేది. ‘ఇంట్లో పిల్లి ఉంది కదా. పాలు పోయాలి.‘ అంటూ అద్దెకు ఉండేవాళ్లతో చెప్పుకొచ్చేది. అద్దెకు ఉండేవాళ్లకు తన పట్ల అనుమానం రాకుండా ఉండేందుకు వారితో బాగానే మాట్లాడేది. అదే సమయంలో భర్తను పూడ్చిపెట్టిన గుంతపై రోజూ నీళ్లు పోసేది. గుంతలో ఇటుకలు, కంకర ఏమైనా కుంగినట్టు కనిపిస్తే, ఆ లోతును మళ్లీపూడ్చేది. మృతదేహం వాసన వస్తోందా? రావడం లేదా? అన్నది తెలుసుకోవడానికే రోజూ అక్కడకు వెళ్లేదని, నీళ్లు పోసేదనీ పోలీసులకు ఆమె వెల్లడించడం గమనార్హం. పోలీసుల విచారణలో ఆమె దోషిగా తేలిన తర్వాత కూడా, ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోవడం గమనార్హం. ’నా భర్తలాంటి మృగాన్ని చంపి నేను మంచి పనే చేశాను. అతడిని పెళ్లి చేసుకున్నందుకు చింతిస్తున్నా. అతడిని చంపినందుకు నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా పిల్లలు అనాథలయ్యారన్న బాధ మాత్రమే ఉంది. ఈ హత్యను నేను మాత్రమే చేశాను. పూడ్చి పెట్టడానికి మాత్రమే సునీల్ సాయం తీసుకున్నాను.’ అని నౌషీమ్ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా, పరారీలో ఉన్న సునీల్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
  ఇది కూడా చదవండి: ప్లీజ్.. నన్ను రెండో పెళ్లయినా చేసుకోమని కోరిన యువతి.. నో చెప్పిన ప్రియుడు.. ఆ భగ్న ప్రేమికురాలు ఎంతకు తెగించిందంటే..
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Hyderabad, Wife kill husband

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు