హోమ్ /వార్తలు /తెలంగాణ /

Video: గుజరాత్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి షాక్..ప్రచారం చేస్తుండగా మోదీ..మోదీ అంటూ నినాదాలు

Video: గుజరాత్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి షాక్..ప్రచారం చేస్తుండగా మోదీ..మోదీ అంటూ నినాదాలు

ఒవైసీ అధినేతకు నిరసన సెగ

ఒవైసీ అధినేతకు నిరసన సెగ

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి గుజరాత్ లో షాక్ తగిలింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయనకు నిరసన సెగ తగిలింది. కాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం బరిలో నిలిచింది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు అసదుద్దీన్ ప్రకటించారు. సూరత్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థి తరపున ప్రచారానికి అసదుద్దీన్ అక్కడకు వెళ్లారు. ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతుండగా..ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది యువకులు నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Gujarat

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)కి గుజరాత్ (Gujarat) లో షాక్ తగిలింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయనకు నిరసన సెగ తగిలింది. కాగా గుజరాత్ (Gujarat) అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం (Mim) బరిలో నిలిచింది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు అసదుద్దీన్  (Asaduddin Owaisi) ప్రకటించారు. సూరత్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థి తరపున ప్రచారానికి అసదుద్దీన్  (Asaduddin Owaisi) అక్కడకు వెళ్లారు. ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతుండగా..ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది యువకులు నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు.

#WATCH | Black flags shown and 'Modi, Modi' slogans raised by some youth at a public meeting addressed by AIMIM MP Asaduddin Owaisi in Gujarat's Surat yesterday pic.twitter.com/qXWzxvUc5V

— ANI (@ANI) November 14, 2022

మొత్తం రెండు దశల్లో గుజరాత్ ఎన్నికలు (Gujarat Election Schedule) నిర్వహించనున్నారు. డిసెంబరు 1న తొలిదశ ఎన్నికలు, డిసెంబరు 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 8న ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు విడుదలవుతాయి. తొలి దశ ఎన్నికలకు నవంబరు 5 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.  14వ తేదీ వరకు గడువు ఉంటుంది. నవంబరు 15న నామినేషన్లను పరిశీలిస్తారు. నవంబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.  డిసెంబరు 1న తొలి దశ పోలింగ్ ఉంటుంది. రెండో దశ ఎన్నికలకు నవంబరు 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నవంబరు 17 వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఇచ్చారు. నవంబరు 18న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల విత్ డ్రాకు నవంబరు 21 వరకు గడువు ఉంటుంది. డిసెంబరు 5న రెండో దశ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి.  4.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 41వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు  ఎన్నికల సంఘం ప్రకటించింది.

గుజరాత్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధాని పోటీ బీజేపీ , కాంగ్రెస్ మధ్యే ఉండేది. కానీ ఈసారి ఆప్ ఎంట్రీ ఇచ్చింది. మేం కూడా పోటీల్లో ఉన్నామంటూ ప్రచారంలో దూసుకెళ్తోంది.  ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ , కాంగ్రెస్ , ఆమాద్మీ మధ్య ముక్కోణపు పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. గుజరాత్ 14వ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18, 2023తో ముగుస్తుంది. అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.

First published:

Tags: Asaduddin Owaisi, Gujarat Assembly Elections 2022, MIM, Telangana

ఉత్తమ కథలు