బాలకృష్ణ, ఉపాసనకు ‘షాక్’.. 

ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక చార్జీల వాసులుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.

news18-telugu
Updated: August 5, 2020, 4:10 PM IST
బాలకృష్ణ, ఉపాసనకు ‘షాక్’.. 
ఉపాసన, బాలకృష్ణ
  • Share this:
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక చార్జీల వాసులుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయంటూ విశ్రాంత ఉద్యోగి ఓ ఎం దేబరా పిల్ దాఖలుచేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. కొందరు పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరతో భూమి కేటాయించిందన్న పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కానీ, అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదని పిటిషనర్ వాదించారు. ఈ క్రమంలో షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించకపోతే మృతదేహం కూడా అప్పగించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని.. భూములు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అపోలో ఆస్పత్రి ఉపాసన కుటుంబానికి చెందినది కాగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి బాలకృష్ణ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 5, 2020, 4:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading