హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cm Kcr: సీఎం కేసీఆర్ కు ఢిల్లీ అధికారుల షాక్..BRS ఫ్లెక్సీల తొలగింపు

Cm Kcr: సీఎం కేసీఆర్ కు ఢిల్లీ అధికారుల షాక్..BRS ఫ్లెక్సీల తొలగింపు

కేసీఆర్ కు ఢిల్లీలో షాక్

కేసీఆర్ కు ఢిల్లీలో షాక్

తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr) కు ఢిల్లీ అధికారులు బిగ్ షాకిచ్చారు. Trs ను Brs గా ఈసి ఆమోదం తెలిపిన తర్వాత మొదటిసారి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. రేపు ఢిల్లీలో BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఆయన అక్కడకు చేరుకున్నారు. ఇవాళ, రేపు రాజశ్యామల యాగం చేయనున్న కేసీఆర్ రేపు మధ్యాహ్నం 12.37 నుండి 12.47 నిమిషాల మధ్య BRS పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అంతకు ముందు BRS జెండాను ఆవిష్కరించనున్నారు. అయితే ఈ క్రమంలో ఢిల్లీ అధికారులు కేసీఆర్ కు షాకిచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr) కు ఢిల్లీ అధికారులు బిగ్ షాకిచ్చారు. Trs ను Brs గా ఈసి ఆమోదం తెలిపిన తర్వాత మొదటిసారి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. రేపు ఢిల్లీలో BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఆయన అక్కడకు చేరుకున్నారు. ఇవాళ, రేపు రాజశ్యామల యాగం చేయనున్న కేసీఆర్ రేపు మధ్యాహ్నం 12.37 నుండి 12.47 నిమిషాల మధ్య BRS పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అంతకు ముందు BRS జెండాను ఆవిష్కరించనున్నారు. అయితే ఈ క్రమంలో ఢిల్లీ అధికారులు కేసీఆర్ కు షాకిచ్చారు. రేపు BRS పార్టీ కార్యాలయ ప్రారంభం, కేసీఆర్ రాకతో అక్కడ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

CM KCR: సీఎం కేసీఆర్ పాలనకు నాలుగేళ్లు పూర్తి..ఇప్పటి వరకు ఎలా సాగిందంటే?

అనుమతి లేదంటున్న మున్సిపల్ అధికారులు..

అయితే ఆ ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదని NDMC అధికారులు తొలగించారు. ఢిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్డులో భారీగా ఏర్పాటు చేసిన BRS ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎలాంటి అనుమతి లేని కారణంగా ఆ ఫ్లెక్సీలన్నీ తొలగించి ఒక్క చోట ఉంచినట్లు తెలుస్తుంది.  కాగా అప్పటివరకు పార్టీ కార్యాలయ రోడ్డు ఫ్లెక్సీలతో కళకళలాడగా ఫ్లెక్సీల తొలగింపుతో పార్టీ ఆఫీస్ బోసిపోయింది.

Wonderful Waterfalls: మనకు దగ్గర్లోనే ఏడుబావులు జలపాతం .. ఆ బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌ ఎక్కడుందంటే

బీఆర్ఎస్ తరపున దాదాపు 1500 మంది

కాగా రేపు BRS కార్యాలయం ప్రారంభం కోసం ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో పాటూ మనవడు హిమాన్షు, ఎమ్మెల్యే బాల్కసుమన్‌ సహా 16 మంది మంత్రులు, ఎంపీలు, నేతలూ వచ్చారు. ఇవాళ మంత్రి కేటీఆర్‌ (KTR), ఎమ్మెల్సీ కవిత (Kavitha) కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్తారు. ఇవాళ, రేపు ఫ్యామిలీతో కలిసి కేసీఆర్ దంపతులు.. నవచండీ హోమం జరుపుతారు. రేపు ఉదయం హోమం ముగిశాక.. పూర్ణాహుతి జరిపి.. పార్టీ ఆఫీస్ ప్రారంభిస్తారు. తర్వాత నేతల సమక్షంలో.. బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తారు. ఈ కార్యక్రమానికి కొందరు జాతీయ స్థాయి నేతలు కూడా రానున్నారు. బీఆర్ఎస్ తరపున దాదాపు 1500 మంది పాల్గొంటారని సమాచారం.

రేపటి BRS కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్టు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం 12.37 నుండి 12.47 నిమిషాల మధ్య BRS పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనితో అధికారికంగా ఢిల్లీలో పార్టీ కార్యాలయం అందుబాటులోకి రానుంది.

First published:

Tags: BRS, CM KCR, Delhi, Telangana

ఉత్తమ కథలు