హోమ్ /వార్తలు /తెలంగాణ /

బ్రేకింగ్: తెలంగాణ ప్రభుత్వానికి షాక్..బిఎల్ సంతోష్ కు ఊరట

బ్రేకింగ్: తెలంగాణ ప్రభుత్వానికి షాక్..బిఎల్ సంతోష్ కు ఊరట

BL సంతోష్ క్వాష్ పిటీషన్

BL సంతోష్ క్వాష్ పిటీషన్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇటీవల బీజేపీ అగ్రనేత BL సంతోష్ కు తెలంగాణ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను రద్దు చేయాలనీ BL సంతోష్ హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సంతోష్ కు ఊరటనిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. అలాగే విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇటీవల బీజేపీ అగ్రనేత BL సంతోష్ కు తెలంగాణ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను రద్దు చేయాలనీ BL సంతోష్ హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సంతోష్ కు ఊరటనిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. అలాగే విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది.

Breaking News: కాంగ్రెస్ కు గుడ్ బై..బీజేపీ తీర్ధం పుచ్చుకున్న మర్రి శశిధర్ రెడ్డి

వాదనలు జరిగాయిలా..

FIR లో BL సంతోష్ పేరు లేనప్పుడు ఆయనను నిందితుల జాబితాల్లో ఎలా చేర్చారని సంతోష్ తరపు న్యాయవాది ప్రకాష్ రెడ్డి వాదించారు. 41A CRPC నోటీసులు ఇచ్చినప్పుడు అందులో టైటిల్ అంటే ఏ కేసులో విచారణకు హాజరు కావాలి అనే అంశాలని ఇవ్వలేదని సంతోష్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆధారాలున్నాయని, విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు బయటపెడతామన్నారు. అయితే కేవలం ఉద్దేశ్యపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని సంతోష్ లాయర్ వాదించారు. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసే వరకు సంతోష్ ను A4గా చేరుస్తామని చెప్పే వరకు అతని పేరు రాలేదు. అయితే మేము నోటీసులు ఇస్తామని వారు విచారణకు రావాల్సి ఉంటుందనేది ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించాడు.

Warangal: మరమ్మతుల పేరుతో రోడ్ల మూసివేత.. పైన పటారం లోన లొటారంగా ఓరుగల్లు

మళ్లీ నోటీసులు ఇవ్వొచ్చా లేదా?

ఇక హైకోర్టు ఆదేశాలతో సిట్ అధికారులు ఇప్పుడు మళ్లీ నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ప్రస్తుత నోటీసులపై కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో కొత్త నోటీసులు ఇవ్వాలని చూస్తుంది కానీ ఇప్పటికే ఇచ్చిన నోటిసులపై కోర్టు స్టే ఇవ్వడంతో మళ్లీ నోటీసులు ఇవ్వలేరని సీనియర్ న్యాయవాది చెబుతున్నారు. కానీ ఈ నోటీసులపై స్టే ఉంది కాబట్టి దీనిపై ముందుకెళ్లడానికి మళ్లీ నోటీసులు ఇవ్వాలని సిట్ చూస్తుంది. మరి దీనిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్ నిందితులతో మాట్లాడినట్టు సిట్ వాదిస్తుంది. అందుకే సంతోష్ ను విచారిస్తే కీలక విషయాలు బయటకు రానున్నాయి. దీనితో సంతోష్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 26న లేదా 28న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే దీనిపై బిఎల్ సంతోష్ హైకోర్టును అశ్రయించగా సిట్ నోటీసులపై స్టే ఇచ్చింది. అలాగే తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.

First published:

ఉత్తమ కథలు