కరోనాతో చెట్టుమీద షెల్టర్ ఏర్పాటు చేసుకున్న శివ పరిస్థితిపై ఎట్టకేలకు ప్రభుత్వ అధికారులు స్పందించారు. మీడియాలో వార్తలు రావడంతో అలర్ట్ అయిన పోలీసులు శివను నల్గొండలోని ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. దీంతో శివ స్టోరీ సుఖాంతం అయినా..ఇలాంటీ వారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో అధికారులు వెలికి తీయాల్సిన అవసరం ఉంది.
కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురిచేస్తుంది. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకునే వారు కొందరు ఉంటే.. వచ్చిన వారు తమ కుటుంబసభ్యులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు చెట్టుపైన మరికొందరు రోడ్లపై ఇంకా కొందరైతే బాత్రుంల్లో కూడ ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేసుకుని ఇలా తనకు సోకిన కరోనా ఇతరులకు ,ముఖ్యంగా కుటుంబసభ్యులకు సోకకూడదనే ఉద్దేశ్యంతో ఓ వ్యక్తి చెట్టుపైనే హోం ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే..
ఈ నేపథ్యంలో.. నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, కోత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్ శివ అనే యువకుడికి కూడా కరోనా సోకింది. దాంతో ఇంట్లోవారికి తన వల్ల కరోనా వస్తుందన్న భయంతో ఏకంగా ఇంటి ముందు చెట్టు మీద తన కోసం విడిగా నివాసం ఏర్పరుచుకున్నాడు.
అయితే ఇంట్లో ఒకే గది ఉండడం ,ఆ గదిలో నలుగురు కుటుంబసభ్యులు కలిసి ఉండడంతో శివకు ఇలాంటీ పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయం మీడియాలో రావడంతో ప్రకంపనలు సృష్టించింది. దీంతో వెంటనే స్పందించిన అధికారులతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు అలర్ట్ అయ్యారు. శివను స్థాని అడవిదేవునిపల్లే మండల కేంద్రంలోని ఐసోలేషన్ సెంటర్కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Isolation on tree, Nalgonda, Nalgonda police