హోమ్ /వార్తలు /తెలంగాణ /

Tahsildar Sujatha died: వివాదాస్పద ‘‘షేక్​పేట మాజీ తహసీల్దార్ సుజాత’’​ మృతి.. పూర్తి వివరాలివే..

Tahsildar Sujatha died: వివాదాస్పద ‘‘షేక్​పేట మాజీ తహసీల్దార్ సుజాత’’​ మృతి.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుజాత గతంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  షేక్‌పేట మాజీ తహసీల్దార్‌ సుజాత  (Sheikhpet Former tehsildar Sujata) మరణించారు. బంజారాహిల్స్‌లోని కోట్ల రూపాయల విలువైన భూ వివాదం (Land Dispute) కేసులో చిక్కుకున్న సుజాత.. 2020లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులు అరెస్టయిన విషయం తెలిసిందే. ఆమె జైలులో ఉండగానే జూన్‌ నెలలో ఆమె భర్త అజయ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా శనివారం ఉదయం ఆమె మృతిచెందింది (Died). అయితే ఆమె మృతిపై పలు అనుమానాలున్నాయి. ఆమె ఆత్మహత్య (Suicide) చేసుకుందని కొందరంటే.. లేదు గుండెపోటుతో (Heart Attack) మరణించిందని మరికొందరంటున్నారు. ఆమె మృతిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.

  కేసు ఏంటి?

  హైదరాబాద్​లోని (Hyderabad) బంజారాహిల్స్ భూ వివాదంలో లంచం తీసుకున్న కేసులో ఇరుక్కున్న సుజాతను తెలంగాణ అవినితీ నిరోధక శాఖ (ACB) అధికారులు గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెం.14లోని 4,865 చదరపు గజాల స్థలంలో అవినీతికి సంబంధించిన ఫిర్యాదుపై 2020 జూన్ 8న సుజాతను ఏసీబీ అరెస్టు చేసింది. గాంధీనగర్‌లోని సుజాత ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించగా బంగారు ఆభరణాలు, రూ.30 లక్షలు దొరికాయి. అయితే తన ఇంట్లో పట్టుబడిన 30 లక్షల రూపాయలకు సంబంధించిన వివరాలను వెల్లడించడంలో సుజాత విఫలమయ్యారు.

  ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులతో పాటు.. సుజాత భర్త అజయ్‌ను కూడా ఏసీబీ విచారించింది. అయితే సుజాత అరెస్ట్ అయిన తర్వాత కొద్ది రోజులకే అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య అరెస్టు అయినప్పటీ నుంచి అజయ్ తన సోదరి వద్ద నివసించాడు. భార్య అరెస్ట్ డిప్రెషన్‌లో ఉన్న అతడు, ఏసీబీ అధికారులు అతడిని విచారణకు పిలవడంతో కలవర చెందాడు. ఈ క్రమంలోనే బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక, ఏసీబీ కేసు ఉండటంతో సుజాత సస్పెండ్ అయ్యారు. అయితే కొద్ది రోజులుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.

  కాగా, ఈ కేసు పలు మలుపులు తిరిగింది. ఎమ్మార్వో ఏసీబీ ట్రాప్‌ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఇందులో ఫిర్యాదుదారు కూడా నిందితుడేనని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిగ్గుతేల్చడంతో.. హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్‌ 6న షేక్‌పేట్‌ ఆర్‌ఐ నాగార్జున రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ కేసుతో తహసీల్దార్‌ సుజాతకూ సంబంధం ఉండటంతో.. ఆమెనూ అరెస్టు చేశారు. ఓ ఎస్సై కూడా అరెస్టయ్యారు. అయితే.. వీరిపై ఫిర్యాదు చేసిన సయ్యద్‌ అబ్దుల్‌ ఖాలెద్‌ కూడా నిందితుడేనని దర్యాప్తులో తేలింది. బంజారాహిల్స్‌లోని 4,865 చదరపు గజాల స్థలం తనదంటూ ఖాలెద్‌ చెబుతున్నది అవాస్తవమని తేల్చారు. అతడు సమర్పించిన పత్రాలన్నీ ఫోర్జరీవేనని నిర్ధారించారు. చర్యలు తీసుకోవాలంటూ సీసీఎస్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన సీసీఎస్‌ ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించి ఖాలెద్‌, అతడి అనుచరుడు అశోక్‌రెడ్డిని అరెస్టు చేశారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Hyderabad

  ఉత్తమ కథలు