• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • SHARMILA POLITICAL PLANS YS SHARMILA TRY TO PREPARE SOME POLITICAL SONGS TO GET MASS FOLLOWING TO HER NEW PARTY SOURCES NK

Sharmila Plans: తెలివైన వ్యూహాలతో షర్మిల... ప్రత్యర్థులకు రంగీలా బ్యాండ్ బాజా

Sharmila Plans: తెలివైన వ్యూహాలతో షర్మిల... ప్రత్యర్థులకు రంగీలా బ్యాండ్ బాజా

తెలివైన వ్యూహాలతో షర్మిల (image credit - twitter - YSRTP)

Sharmila Political Plans: తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్న షర్మిలను నమ్మాలా, వద్దా అనే దానిపై ఇప్పటికీ ప్రజల్లో కన్‌ఫ్యూజన్ ఉంది. మరోవైపు ఆమె తాజాగా వేస్తున్న వ్యూహమేంటో తెలుసుకుందాం.

 • Share this:
  Sharmila Politics: రాజకీయ నేతలతో ఓ పెద్ద చిక్కు ఉంటుంది. వాళ్లు ఏదీ డైరెక్టుగా చెప్పరు. కానీ చిన్న చిన్న రూమర్లు, ఫీలర్లను ప్రజల్లోకి వెళ్లేలా చేస్తారు. ఆ తర్వాత వాటిపై పెద్ద చర్చ జరుగుతుంది. చివరకు వారి ఫీలర్లపై వారినే మీడియా ప్రశ్నిస్తే... నర్మగర్భంగా మాట్లాడి సైలెంటవుతారు. ఫీలర్లపై ప్రజల్లో పాజిటివ్ ఫీలింగ్ వస్తే... వాటిని అమలు చేస్తారు. తాజాగా తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్న వైఎస్ షర్మిల... ఇందుకోసం కాస్త గట్టిగానే పొలిటికల్ మసాలా వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా... ఒకప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వైఎస్ జగన్ వరకూ... ప్రతి ఒక్కరూ తమ పార్టీలు ప్రజల్లోకి ముఖ్యంగా మాస్‌లోకి వెళ్లేందుకు పాటలనే అస్త్రాలుగా చేసుకున్నందున... షర్మిల కూడా ఆ దిశగా కొన్ని పాటలు రెడీ చేయిస్తున్నట్లు తెలిసింది.

  ఇప్పటికే షర్మిల... వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ మధ్యే విద్యార్థులు, విద్యార్థి సంఘాల వారిని కూడా కలిసి... తెలంగాణలో ఉద్యోగాలు, ఖాళీలపై చర్చించారు. పార్టీ పేరు ఎప్పుడు ప్రకటించాలో డిసైడ్ చేయమని తన మద్దతు దారులను కోరుతున్నారు. ఐతే... పార్టీ ప్రకటించాక... సభలు, సమావేశాలు తప్పనిసరి... అప్పుడు మాస్ ఫాలోయింగ్ పెంచుకోవాలంటే... ప్రజల నోట్లో పార్టీ పేరు మారు మోగాలి. అలా జరగాలంటే... పాటలు, అవి కూడా ఎమోషనల్ సాంగ్స్ ఉండాలి.... అని షర్మిలకు అత్యంత సన్నిహితులు సూచించినట్లు తెలిసింది.


  తెలంగాణ గ్రామాల్లో జానపద పాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ప్రజలు ఎలాంటి మ్యూజిక్ పరికరాలూ లేకుండా... నోటి ద్వారానే ఆ పాటలు పాడుతూ ఉంటారు. అదే విధంగా పల్లె పాటల సారాన్ని ప్రతిభింబించేలా షర్మిల చేయించబోయే సాంగ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో... వైఎస్ రాజశేఖర రెడ్డి త్యాగాలను గుర్తు చేసేలా, ప్రత్యర్థి పార్టీలను చెడుగుడు ఆడేలా, తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసేలా, యువతను ఉర్రూతలూగించేలా పాటల్లో అన్ని కోణాలూ ఉండేలా చేయించబోతున్నట్లు తెలిసింది.


  షర్మిలను నమ్మాలా?
  ఓ వైపు పార్టీ ఏర్పాటు దిశగా షర్మిల అడుగులు వేస్తూ పోతుంటే... అసలు ఆమెను నమ్మాలా వద్దా అనే అంశంపై ప్రజల్లో అయోమయం ఉందని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఆమె కేసీఆర్ వదిలిన బాణం అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఓ సామాజిక వర్గం ఓట్లను చీల్చడం ద్వారా... కాంగ్రెస్ బలపడకుండా ఉండేలా కేసీఆర్ ఇదంతా నడిపిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. వీటిపై షర్మిల పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు. తాను తెలంగాణలో వైఎస్ పాలనను గుర్తుచేస్తాననీ, తన ప్రాంతీయతను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని అంటున్నారు.

  ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారు ఇతరులను ఇట్టే ఆకర్షించగలరు... మీది ఏ రాశి

  ఈ పాటలు రాయిస్తున్న విషయంపై షర్మిల గానీ ఆమె వర్గీయులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చెయ్యలేదు. కానీ పైన చెప్పుకున్నట్లు ఫీలర్స్ వచ్చేశాయి. ఆల్రెడీ పార్టీ పెట్టబోతున్న విషయంపైనా ఇలాగే ఫీలర్స్ వచ్చాయి. అవి కాస్తా నిజం అవుతున్నాయి. మరి పాటల వ్యూహం కూడా నిజమైతే... అది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందన్నది నెక్ట్స్ తేలాల్సిన ప్రశ్న.
  Published by:Krishna Kumar N
  First published: