హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ys Sharmila: తెలంగాణ సర్కార్ పై షర్మిల ఫైర్..ఫారెస్ట్ అధికారి హత్యకు కేసీఆరే కారణం!

Ys Sharmila: తెలంగాణ సర్కార్ పై షర్మిల ఫైర్..ఫారెస్ట్ అధికారి హత్యకు కేసీఆరే కారణం!

Ys షర్మిల

Ys షర్మిల

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు Ys షర్మిల టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. టీఆర్.ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ అమ్ముడుపోయాయని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈడీ రైడ్స్ ఎందుకు చేయడం లేదని షర్మిల సూటిగా ప్రశ్నించారు. వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర కరీంనగర్, ధర్మపురి, పరకాలలో ముగించుకొని ములుగు జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు Ys షర్మిల (Ys Sharmila) టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. టీఆర్.ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ అమ్ముడుపోయాయని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈడీ (Enforcement Direcorate) రైడ్స్ ఎందుకు చేయడం లేదని షర్మిల సూటిగా ప్రశ్నించారు. వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర కరీంనగర్ (Karimnagar), ధర్మపురి, పరకాలలో ముగించుకొని ములుగు (Mulugu) జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో షర్మిల (Ys Sharmila) ఈ వ్యాఖ్యలు చేశారు.

Telangana: రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. డిసెంబరులో డబ్బులు

కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగిన షర్మిల..

ఫారెస్ట్ అధికారి హత్యకు సీఎం కేసీఆరే కారణం అని షర్మిల ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ పాలనలోకి వచ్చి 8 ఏళ్లు అయినా కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్ హామీలు నెరవేర్చకున్న బీజేపీ , కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కేసీఆర్ కు అసలు పాలన చేయడమే చేత కాదని అన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కేసీఆర్ జనాల్లోకి వస్తారని షర్మిల తీవ్ర స్థాయిలో విసీమర్శించారు.  ఎన్నికల సమయంలో కుర్చీ వేసుకుని పోడు పట్టాలు ఇస్తానన్న KCR, ఒక్క ఎకరాకు కూడా పట్టా ఇవ్వకపోగా.. ఫారెస్ట్ ఆఫీసర్లు, గిరిజనుల మధ్య చిచ్చు పెట్టిండన్నారు. ఇరువర్గాలను రెచ్చగొట్టి అమాయక ప్రాణాలను బలిగొన్నాడు. చంటి పిల్లల తల్లులను కూడా జైల్లో వేయించిండు. ఎఫ్ఆర్వో మరణానికి కారణం కేసీఆరే అని ఆరోపించారు.

Hyderabad Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో అనూహ్య పరిణామం..ఎట్టకేలకు బాలమురుగన్ అరెస్ట్

అందుకే ప్రజాప్రస్థానం చేపట్టాం..

ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేసి, వారి ముఖాల్లో చిరునవ్వు చూడడం కోసమే ఈ ప్రజాప్రస్థానం చేపట్టాం అని షర్మిల తెలిపారు. చిన్నారుల భవిష్యత్తు కోసం, మహిళల స్వయం సమృద్ధి కోసం, కర్షకుల బలోపేతం కోసం, అన్ని వర్గాల అభివృద్ధి కోసం YSR తెలంగాణ పార్టీ కట్టుబడి పని చేస్తుందన్నారు Ys షర్మిల.

First published:

Tags: Bhupalapally, Hyderabad, Telangana, Telangana News

ఉత్తమ కథలు