Telangana New Secretariat: ఆ సంస్థకి తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణ పనులు

Shapoorji Pallonji: తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణ పనుల టెండర్ కోసం షాపూర్జీ పల్లోంజితో పాటు ఎల్ అండ్ టీ సంస్థలు తుదివరకు పోటీ పడ్డాయి.

news18-telugu
Updated: October 28, 2020, 10:55 PM IST
Telangana New Secretariat: ఆ సంస్థకి తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణ పనులు
తెలంగాణ కొత్త సచివాలయం నమూనా చిత్రం
  • Share this:
తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ ఖరారైంది. షాపూర్జీ పల్లోంజి సంస్థ ఈ కీలక టెండర్‌ను సొంతం చేసుకుంది. ఏడాదిలోపు సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని షాపూర్జీ పల్లోంజి సంస్థకు ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ టెండర్ కోసం షాపూర్జీ పల్లోంజితో పాటు ఎల్ అండ్ టీ సంస్థ తుదివరకు పోటీ పడ్డాయి. అయితే చివరకు షాపూర్జీ పల్లోంజి సంస్థ ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది.

టెండర్ కాంట్రాక్ట్ ప్రకారం 2 ఎకరాల్లోని ప్రాంతంలో 7 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ భవన నిర్మాణం ఉంటుందని సమాచారం. మిగతా 25 ఎకరాల క్యాంపస్ లో... ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్, ఇతర సదుపాయాలు ఉంటాయి. భవనంలోని మధ్య పోర్షన్ లో అశోకుడి ధర్మ చక్ర స్తూపం ఉంటుంది. అది 15 అంతస్థుల ఎత్తు ఉంటుంది. ముఖ్యమంత్రి ఆఫీసు ఆరో అంతస్థులో ఉంటుంది.

తెలంగాణ కొత్త సచివాలయాన్ని రాష్ట్ర కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా అద్భుత రీతిలో నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్త సచివాలయం డిజైన్‌పై కొన్ని రోజులపాటు సీఎం కేసీఆర్ కసరత్తులు చేశారు. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లతో చర్చించి డిజైన్‌ను ఖరారు చేశారు. మొత్తం ఏడు అంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మించనున్నారు. పాత సచివాలయం భవనాలు శిథిలావస్థలో ఉన్నందున, దాన్ని కూల్చేసింది తెలంగాణ ప్రభుత్వం. కూల్చివేతకు ముందు ఈ అంశంపై హైకోర్టులో కొన్ని రోజులు కేసు నడిచింది. ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో జూలై 7 కూల్చివేత పనులను ప్రారంభించి, కొద్ది రోజుల్లోనే పాత సచివాలయాన్ని నేలమట్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కూల్చివేత సమయంలోనూ హైకోర్టు పలుమార్లు స్టే విధించినా.. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూల్చివేత ప్రక్రియ ముగిసింది. తాజాగా తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణ పనుల కాంట్రాక్ట్‌ను షాపూర్జీ పల్లోంజి సంస్థ సొంతం చేసుకుంది. సుమారు రూ. 500 కోట్లతో తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణాన్ని చేపట్టనుంది.
Published by: Kishore Akkaladevi
First published: October 28, 2020, 10:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading