చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్తత...షాద్‌నగర్ లైంగికదాడి నిందితులను అప్పగించాలంటూ ఆందోళన

పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు రంగంలోకి దిగారు.

news18-telugu
Updated: November 30, 2019, 10:57 PM IST
చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్తత...షాద్‌నగర్ లైంగికదాడి నిందితులను అప్పగించాలంటూ ఆందోళన
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎదురైన నిరసనలు.. చర్లపల్లి జైలు వద్ద కూడా కొనసాగుతున్నాయి. షాద్‌నగర్ హత్య కేసు నిందితులను తమకు అప్పగించాంటూ కొంత మంది యువకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు రంగంలోకి దిగారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో జైలు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను నిలువరించేందుకు జైలు వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నలుగురు నిందితులను హైసెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచినట్లు జైలు అధికారుల సమాచారం...

First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>