షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ కేసు: రేపు సుప్రీంకోర్టు ముందుకు సజ్జనార్

బుధవారం సుప్రీంకోర్టులో జరగనున్న విచారణకు సైబారాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్వయంగా హాజరుకానున్నారు. ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులను స్వయంగా కోర్టుకు వివరించనున్నారు.

news18-telugu
Updated: December 10, 2019, 6:27 PM IST
షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ కేసు: రేపు సుప్రీంకోర్టు ముందుకు సజ్జనార్
సైబరాబాద్ సీపీ సజ్జనార్
  • Share this:
దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశం ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశాకు సత్వర న్యాయం జరిగిందని సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐతే ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఎన్‌కౌంటర్‌పై ఎన్నో అనుమానాలున్నాయని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బుధవారం సుప్రీంకోర్టులో జరగనున్న విచారణకు సైబారాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్వయంగా హాజరుకానున్నారు. ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులను స్వయంగా కోర్టుకు వివరించనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది.

దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు. పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన 16 మార్గదర్శకాలను అమలు చేయాల్సిందిగా ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌‌ను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో, ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందంతో విచారణ జరిపించాలని కోరారు. ఈ పిల్‌పై బుధవారం విచారణ జరపనుంది సుప్రీంకోర్టు.

కాగా, డిసెంబరు 6న దిశను తగులబెట్టిన చోటే నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. షాద్ నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి సమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయారు. దిశా సెల్‌ఫోన్‌ను చూపిస్తామంటే అక్కడికి తీసుకెళ్లామని.. ఆ సమయంలో పోలీసులపై దాడిచేసి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేసి తుపాకులు లాక్కున్నారని.. అనంతరం కాల్పులు జరిపారని చెప్పారు. ఆ క్రమంలోనే ఎదురు కాల్పులు జరిపారని... తాము ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులూ చనిపోయారని సీపీ సజ్జనార్ చెప్పిన విషయం తెలిసిందే.

First published: December 10, 2019, 6:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading