పోలీస్ కస్టడీకి దిశ హత్య కేసు నిందితులు

దిశ హత్య కేసు నిందితులను పోలీస్ కస్టడీకి షాద్ నగర్ కోర్టు అనుమతిచ్చింది.

news18-telugu
Updated: December 4, 2019, 6:18 PM IST
పోలీస్ కస్టడీకి దిశ హత్య కేసు నిందితులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దిశ హత్య కేసు నిందితులను పోలీస్ కస్టడీకి షాద్ నగర్ కోర్టు అనుమతిచ్చింది. నిందితులను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. దీంతో నిందితులను రేపు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం ఈ కేసులోని నలుగురు నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి మరింత సమాచారం కోసం పోలీసులు వారిని విచారించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాయడం... అందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. మహబూబ్ నగర్‌లో ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కానుంది.
Published by: Kishore Akkaladevi
First published: December 4, 2019, 6:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading