హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad : ఉక్రెయిన్‌లో నిజామాబాద్ విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండ్రులు..

Nizamabad : ఉక్రెయిన్‌లో నిజామాబాద్ విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండ్రులు..

ఉక్రెయిన్‌లో ఉన్న నిజామాబాద్ విద్యార్థి

ఉక్రెయిన్‌లో ఉన్న నిజామాబాద్ విద్యార్థి

Nizamabad : రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్దం తెలుగు విద్యార్థులకు దడ పుట్టిస్తోంది. తెలంగాణ జిల్లాల నుండి వెళ్లిన విద్యార్థులు అనేక మంది ఉన్నారు. ఇలా ఒక్క నిజామాబాద్ జిల్లా నుండి వెళ్లిన వారే 17 మంది ఉన్నట్టు తెలుస్తోంది.

  రష్యా ఉక్రెయిన్ దేశాల యుద్దం తెలుగు విద్యార్థులకు దడ పుట్టిస్తోంది. రాష్ట్రం నుండి పలు జిల్లాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్లారు. యుద్దంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే దేశ వ్యాప్తంగా 16 వేల మంది భారతీయులను ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ చెబుతోంది.

  నిజామాబాద్ జిల్లాకు చెందిన కొంద‌రు విద్యార్థులు ఎంబీబీఎస్ చ‌దివేందుకు ఉక్రెయిన్ దేశానికి వెళ్లారు.. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయ‌డంతో అక్కడే చిక్కుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెల‌కొంది.... అయితే జిల్లా నుంచి 17 మంది విద్యార్థులు ఉక్రెయిన్ లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నార‌ని తెలిసింది. కొంత మంది విద్యార్థులు బాంబుల వర్షం కురుస్తున్న కీవ్ పట్టణంలో ఉండగా.. మ‌రి కొంద‌రు దూరంగా ఉన్న‌ార‌ని తెలుస్తోంది... యుద్ధవాతావరణ భయం వారిని పీడిస్తోంది. విద్యార్థులు మాత్రం ఇక్కడి తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తాము క్షేమంగానే ఉన్నట్లు ధైర్యాన్ని ఇస్తున్నారు.

  Khammam : కొడుకు చనిపోతే.., నేను లేనా... కోడలిపై మామ అరాచకం.. పెళ్లంటూ దాడి..!

  మరోవైపు బోధన్ పట్టణానికి చెందిన‌ హార్డ్ వేర్ వ్యాపారి ముప్పారాజు సరేంద్ర బాబు, సంధ్య దంపతుల పెద్ద కుమారుడు వినయ్ చౌదరి.. ఉక్రెయిన్ లోని జాకర్ పట్టీయా ఓడాస్ట్ యూనివర్సిటీలో విన‌య్ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు... ఉక్రెయిన్ లో యుద్ధం మొద‌ల‌వ‌డంతో వినయ్ తల్లి దండ్రులు ఇక్కడ ఆందోళనకు గుర‌య్యారు.. దీంతో విన‌య్ కు వాట్స‌ఫ్ కాల్ లో మాట్లాడ‌మ‌ని విన‌య్ తండ్రి న‌రేంద్ర బాబు చెబుతున్నారు.. యుద్దం జ‌రుగుతున్న చోటుకి మా బాబు ఉంటున్న చోటుకి చాలా దూరం ఉందని చెప్పాడు..


  Nalgonda : ఇదేంటి మాష్టారు..? స్కూలు పిల్లలతో పాటు.. తల్లులను కూడా ఇలా చేస్తారా...?

  నిజామాబాద్ నగరం కోటగల్లీకి చెందిన గడ్డం మీదా ఉక్రెయిన్ లోని కీప్ పట్టణానికి సమీపంలో కర్కియులో నేషనల్ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. 2016 సంవత్సరంలో అక్కడికి వెళ్లింది. ప్రస్తుతం దాడులు జరుగుతున్న ప్రాంతానికి ఈమె ఉంటున్న ప్రాంతం సమీపంలో ఉందని కుటుంబ‌స‌భ్యులు తెలిపారు.. మాక్లూర్ మండలం మదనపల్లికి చెందిన గాజుల శ్రీనివాస్ కుమారుడైన గాజుల అభిషేక్ ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నాడు.. బోధన్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రజియా బేగం కుమారుడు మహ్మద్ నిజాముద్దీన్ ఉక్రెయిన్ దేశంలోని ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుకుంటున్నారు. ఏడాది క్రితం ఎంబీబీఎస్ చదువుకోసం ఇక్కడి నుంచి వెళ్లాడు. సిరికొండ మండలానికి చెందిన‌ మోజీరాం, బుజ్జి దంపతుల కుమారుడు కార్తీక్ నాయక్. ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చ‌దువుకునేందుకు కార్తీక్ నాయ‌క్ 13 నెలల క్రితం వెళ్లాడు. మాక్లూర్ మండ‌లం మ‌ద‌న్ ప‌ల్లికి చెందిన‌ గాజుల శ్రీనివాస్ కుమారుడు గాజుల అభిషేక్.. ఉక్రెయిన్ లోని కివ్ మెడిక‌ల్ యూనిర్సిటీ లో ఎంబీబీఎస్ మూడొ సంత్స‌రం చ‌దువుతున్నారు

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Nizamabad, Ukraine

  ఉత్తమ కథలు