హోమ్ /వార్తలు /తెలంగాణ /

7 నెలల గర్భిణీ.. భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తున్న భర్త.. వెనకనుంచి దూసుకొచ్చిన ఆటో.. బైక్ ను ఢీకొట్టడంతో..

7 నెలల గర్భిణీ.. భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తున్న భర్త.. వెనకనుంచి దూసుకొచ్చిన ఆటో.. బైక్ ను ఢీకొట్టడంతో..

రోడ్డు ప్రమాదంలో మరణించిన భార్యాభర్తలు

రోడ్డు ప్రమాదంలో మరణించిన భార్యాభర్తలు

ప్రస్తుతం ఏడో నెల కావడంతో భార్య స్వప్నను నగునూరులోని ప్రతిమ ఆసుపత్రిలో చూపించడానికి ఇంటి నుంచి బయలు దేరారు. రెవెళ్లి శివారు దాటి రాగంపేట శివారు లోని పెద్దమ్మ గుడి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆటో ( ఏపీ 15 టీఏ 9012 ) వీరిని ఢీకొట్టింది. దీంతో..

ఇంకా చదవండి ...

కొద్ది రోజుల క్రితమే ఓ గర్భిణి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. రెండోసారి గర్భవతి అయిన ఆమె ఆసుపత్రిలో చెకప్ చేయించుకుని భర్తతో కలిసి బైక్ పై తిరిగి వస్తుండగా ఘోరం జరిగింది. ఓ బస్సు రూపంలో ఆమెను మృత్యువు వెంటాడింది. వారి పక్క నుంచి వచ్చిన బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ఆమె కిందపడిపోయింది. బస్సు ఆమె మీదుగా వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన జరిగి కొద్ది రోజులు కూడా కాకముందే మరో నిండు గర్భిణి రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమెతో పాటు ఆమె భర్త కూడా మృత్యువాత పడ్డాడు. ఏడు నెలల గర్భిణి అయిన తన భార్యను ఆసుపత్రిలో చెకప్ చేయించుకోవడానికి తీసుకెళ్తోంటే ఈ ఘోరం జరిగింది. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చొప్పదండి మండలం రెవెళ్లి గ్రామానికి చెందిన వొడ్నాల సంపత్ కు పక్కనే ఉన్న రాగం పేటకు చెందిన స్వప్నతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ దంపతులకు మూడేళ్ల కూతురు కూడా ఉంది. ప్రస్తుతం స్వప్న 7 నెలల గర్భిణి. భార్య గర్భిణి కావడంతో సంపత్ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ప్రతీ నెలా ఆసుపత్రికి తీసుకెళ్లి చెకప్ చేయిస్తూ ఉంటాడు. సంపత్ స్థానికంగా కూలి పని , వ్యవసాయ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం ఏడో నెల కావడంతో భార్య స్వప్నను నగునూరులోని ప్రతిమ ఆసుపత్రిలో చూపించడానికి గురువారం ఇంటి నుంచి బయలు దేరారు.

ఇది కూడా చదవండి: ఒక్క ఘటనతో వరుడికి డబుల్ షాక్స్.. తెల్లవారుజామున వధువును తీసుకెళ్లిన తాత.. చివరకు సీన్ రివర్స్

రెవెళ్లి శివారు దాటి రాగంపేట శివారు లోని పెద్దమ్మ గుడి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆటో ( ఏపీ 15 టీఏ 9012 ) వీరిని ఢీకొట్టింది. అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చిన ఆటో డ్రైవర్ బైక్ ని బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్ పై నుంచి ఎగిరిపడి చాలా దూరంలో పడిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతోపాటు, ఆమె పొట్టకు కూడా రోడ్డు బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. స్థానికులు సంపత్ ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతిచెందాడు. దీనితో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గర్భిణి అయిన స్వప్న మరణించడం, సంపత్ కూడా మృత్యువాత పడటంతో వారి ముద్దుల కూతురు అనాథలా మిగిలిపోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంపత్ తల్లి వొడ్నాల లచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇది కూడా చదవండి: పెళ్లికి వెళ్లిన భర్త మిస్సింగ్.. కేసు పెట్టిన కొద్ది రోజుల్లోనే భార్య కూడా అదృశ్యం.. ఆ ఇంటి పెరట్లో బయటపడిన బండారం..!

First published:

Tags: Bus accident, Car accident, Crime news, Crime story, CYBER CRIME, Karimangar

ఉత్తమ కథలు