హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka Bypolls 2020: సిద్ధిపేటలో రూ.7.50 లక్షలు సీజ్.. ఇంతకీ ఎవరిదా సొమ్ము..?

Dubbaka Bypolls 2020: సిద్ధిపేటలో రూ.7.50 లక్షలు సీజ్.. ఇంతకీ ఎవరిదా సొమ్ము..?

నగదు సీజ్ చేస్తున్న దృశ్యం

నగదు సీజ్ చేస్తున్న దృశ్యం

త్వరలో ఎన్నికలు జరుగనున్న దుబ్బాకలో ఎలాంటి ఆధారాలు చూపించకుండా తీసుకెళ్తున్న రూ. 7.50 లక్షలను పోలీసులు సీజ్ చేశారు.

 • News18
 • Last Updated :

  ఎలాంటి ఆధారాలూ లేకుండా తీసుకుని వెళుతున్న రూ. 7.50 లక్షలను సీజ్ చేసినట్టు సిద్దిపేట పోలీసులు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా సిద్దిపేట పట్టణం మెదక్ రోడ్ హై స్కూల్ వద్ద సిద్దిపేట ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ ఆంజనేయులు, మరియు ట్రాఫిక్ సిబ్బందితో కలిపి వాహనాలు తనిఖీ చేస్తుండగా పుల్లూరు గ్రామానికి చెందిన చొప్పదండి మణికంఠ.. తండ్రి శ్రీనివాస్ తన వాహనంలో ఉన్న బ్యాగులో 7 లక్షల 50 వేల రూపాయలు తీసుకెళ్తున్నారు. అయితే ఈ నగదుకు ఎలాంటి ఆధారాలు చూపించలేదు. దీంతో ఈ సొమ్మును పోలీసులు సీజ్ చేశారు.

  పట్టుబడ్డ నగదును వన్ టౌన్ సీఐ సైదులు పంచనామా చేసి జిల్లా ఎన్నికల కార్యాలయం కలెక్టర్ ఆఫీస్ నందు డిపాజిట్ చేశారు. నగదు తీసుకెళ్తున్న సదరు వ్యక్తి డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపించి వాటిని తీసుకెళ్లవచ్చునని పోలీసులు తెలిపారు.

  ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద 50 వేల రూపాయలకు మించి డబ్బులు తీసుకెళ్లవొద్దనీ, అంతకంటే ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు, పత్రాలు చూపించకుంటే వాటిని సీజ్ చేస్తామని తెలిపారు. వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీలు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా చేసుకోవాలని సూచించారు.

  కాగా, ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అంత నగదు పట్టుబడటం జిల్లాలో కలకలం రేపింది. ప్రచార తేదీలు దగ్గర పడుతుండటం, ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

  వీరన్న (మెదక్ ప్రతినిది) న్యూస్ 18

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Siddipet

  ఉత్తమ కథలు