మరో సీరియల్ కిల్లర్ అరెస్ట్.. మహిళలతో పరిచయం పెంచుకుని, మాటలు కలిపి.. పొలాల్లోకి తీసుకెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

భర్తను మోసగించి ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్న మహిళలను టార్గెట్ గా చేసుకుని, వారితో స్నేహం చేసి నమ్మించి చంపేసే సీరియల్ కిల్లర్ గురించి చదివే ఉంటారు. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ పోలీసులు అతడిని అరెస్ట్ కూడా చేశారు. తాజాగా..

 • Share this:
  భర్తను మోసగించి ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్న మహిళలను టార్గెట్ గా చేసుకుని, వారితో స్నేహం చేసి నమ్మించి చంపేసే సీరియల్ కిల్లర్ గురించి చదివే ఉంటారు. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ పోలీసులు అతడిని అరెస్ట్ కూడా చేశారు. తాజాగా మరో సీరియల్ కిల్లర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ గా చేసుకుని, వారిని నమ్మించి తన వెంట తీసుకెళ్లి చంపేస్తుంటాడు. ఆ తర్వాత వారి ఒంటిపై ఉన్న బంగారపు ఆభరణాలును దోచుకుంటాడు. ఆ మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పక్కా ప్లాన్ వేస్తాడు. మృతదేహాల ముఖాలను గుర్తు పట్టకుండా చేయడమో, పెట్రోల్ పోసి కాల్చడమో చేస్తుంటాడు. ఓ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు ఎట్టకేలకు అతడు దొరికిపోయాడు. గతంలోనూ చేసిన హత్యల జాబితాను అతడు చెబుతుండటంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది.

  వికారాబాద్ జిల్లా ధారూరు మండలం అవునుపల్లికి చెందిన 38 ఏళ్ల అమృతమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కొద్ది రోజుల క్రితం కూలి పనుల నిమిత్తమై వికారాబాద్ లోని అడ్డాకు వచ్చింది. పని నిమిత్తం వెల్లిన అమృతమ్మ ఎంతకూ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. వికారాబాద్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అదే సమయంలో సిరిగేట్ పల్లి రైల్వే గేట్ సమీపంలో పొలం పక్కన మృతదేహం ఉందన్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అమృతమ్మ కుటుంబ సభ్యులను కూడా అక్కడకు రప్పించారు. మృతదేహం ఆమెదే అని నిర్ధారణ చేసుకున్నారు. అయితే ఆమె శరీరంపై నగలు లేకపోవడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు విషయం తెలియజేశారు. నగల కోసమే హత్య జరిగి ఉంటుందని ఆ దిశగా విచారణ చేపట్టారు.
  ఇది కూడా చదవండి: ఒక్క ఘటనతో వరుడికి డబుల్ షాక్స్.. తెల్లవారుజామున వధువును తీసుకెళ్లిన తాత.. చివరకు సీన్ రివర్స్

  విచారణలో భాగంగా వికారాబాద్ లోని అడ్డా వద్ద సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అక్కడ ఓ ఆటోలో అమృతమ్మ ఆలంపల్లి వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆమెతోపాటు అల్లీపూర్ కు చెందిన మాల కిష్టప్ప కూడా ఉండటంతో కేసులో సగం మిస్టరీని చేధించారు. మాల కిష్టప్ప ఆమెను కల్లు తాగించాడు. ఆ తర్వాత ఆటోలో కొత్తగడి వైపునకు వెళ్లి సిరిగేట్ పల్లికి వెళ్లే రోడ్డు వద్ద ఆటో దిగారు. ఇద్దరూ నడుచుకుంటూ రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఓ పొలంలోకి వెళ్లారు. ఆమె మద్యం మత్తులో ఉండా చంపేసి, ఆమెపై ఉన్న బంగారాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత నగలను తాకట్టు పెట్టేందుకు యత్నించాడు. అయితే ఆధార్ కార్డు లేకపోవడంతో తాకట్టు పెట్టడం కుదరలేదు.
  ఇది కూడా చదవండి: రోజుల గ్యాప్ లోనే వరుస ఘటనలు.. ప్రపంచం అంతానికి ఇవే చివరి సూచనలు.. 2021లో ఏం జరగబోతోందో ముందే చెప్పిన నోస్ట్రడామస్..!

  పోలీసులు రంగంలోకి దిగి కిష్టప్పను అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నిస్తే మరిన్ని షాకింగ్ నిజాలు చెప్పాడు. 1985లో తాను మొదటిసారి హత్య చేసినట్టు పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత 2008లో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో హత్య, అదే సంవత్సరం తాండూరులో మరో మహిళను హత్య చేశాడు. 2010లో యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో మరో హత్యచేశాడు. 2016లో వికారాబాద్ లో ఇంకో హత్య చేశాడు. తాజాగా మరో మహిళను కూడా చంపాడు. మొత్తం మీద ఆరుగురిని ఇప్పటి వరకు అతడు హత్య చేశాడు. ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకోవడం, ఆ తర్వాత నమ్మించి దూరంగా తీసుకెళ్లడం వారిని చంపి, వారి వద్ద ఉన్న నగలను, డబ్బును దోచుకెళ్లడం అతడికి అలవాటు. మహిళలను గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి కాల్చినట్టు కూడా వెల్లడించాడు. దీంతో కిష్టప్పపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అతడికి రిమాండ్ విధించారు.
  ఇది కూడా చదవండి: సెలూన్‌లో పనిచేసే 23 ఏళ్ల కుర్రాడు.. హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్‌ యువతి.. కులం, మతం వేరైనా ఆమె పెళ్లికి సిద్ధపడినా..
  Published by:Hasaan Kandula
  First published: