హోమ్ /వార్తలు /తెలంగాణ /

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జర్మనీ, బ్రిటన్‌, ఇంగ్లాండ్‌ల నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ సరఫరా అయినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది.

  ఓ వైపు బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు సంచలన సృష్టిస్తుంటే.. రెండేళ్ల క్రితం టాలీవుడ్‌ను షేక్ చేసిన డ్రగ్స్ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు అంశంపై సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా ఎక్సైజ్ శాఖను ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కోరింది. దీనికి సమాధానం ఇచ్చిన ఎక్సైజ్‌శాఖ.. గత రెండేళ్లలో 12 డ్రగ్స్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. 12 కేసుల్లో 8 కేసుల్లో చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు తెలిపింది. అయితే టాలీవుడ్‌కు సంబంధించిన నాలుగు కేసులపై మాత్రం ఎక్సైజ్ శాఖ ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. ఎక్సైజ్‌శాఖ దాఖలు చేసిన 8 చార్జిషీట్లలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

  అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై తీగ లాగితే డొంకకదిలినట్టు ఈ డ్రగ్స్ దందా ఖండాంతరాలు దాటింది. జర్మనీ, బ్రిటన్‌, ఇంగ్లాండ్‌ల నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ సరఫరా అయినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. విదేశాల నుంచి స్టీల్‌బౌల్స్‌ పేరుతో కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ హైదరాబాద్‌కు చేరినట్లు స్పష్టం చేసింది. www.ipsld.lo వెబ్‌సైట్‌ ద్వారా స్టూడెంట్స్‌ డ్రగ్స్‌ బుకింగ్‌ చేసుకున్నారని పేర్కొంది. సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ మహేశ్వర ఫార్మాలో సైతం డ్రగ్స్‌ దందా జరిగినట్లు వెల్లడించింది. 8 చార్జిషీట్లలో కళాశాల విద్యార్థులతో పాటు ప్రముఖుల పేర్లను నమోదు చేసినట్లు పేర్కొంది. ఇక 2017లో సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ కేసులో ఎక్సైజ్ శాఖ 72 మంది పేర్లు నమోదు చేసింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Crime news, Drugs, Telangana, Tollywood drugs case

  ఉత్తమ కథలు