హోమ్ /వార్తలు /తెలంగాణ /

'కేసీఆర్ కు బట్టతల బాధితుల సంచలన డిమాండ్'..సంక్రాంతి వరకు ఫించన్ ఇవ్వాల్సిందే..లేదంటే..

'కేసీఆర్ కు బట్టతల బాధితుల సంచలన డిమాండ్'..సంక్రాంతి వరకు ఫించన్ ఇవ్వాల్సిందే..లేదంటే..

కేసీఆర్ కు బట్టతల బాధితుల సంచలన డిమాండ్

కేసీఆర్ కు బట్టతల బాధితుల సంచలన డిమాండ్

తెలంగాణ ప్రభుత్వం అనేక వర్గాలకు పెన్షన్ అందిస్తుంది. ముఖ్యంగా వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, బోద కాలు బాధితులకు, నేతన్నలకు, బీడీ కార్మికులకు ప్రతీ నెల నెల పెన్షన్ అందిస్తుంది. ఆ డబ్బులతోనే బ్రతుకు మీద భరోసాతో వారు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా మరో వర్గం వారు కూడా తమకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రూ.1000, రూ.2000 కాదు ఏకంగా రూ.6000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాము సమాజంలో అనేక అవమానాలు ఎదుర్కొంటున్నామని తమకు ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తమ డిమాండ్ కు డెడ్ లైన్ కూడా పెట్టారు. సంక్రాంతి వరకు తమకు రూ.6000 పెన్షన్ ఇవాలంటున్నారు. ఇంతకీ ఆ బాధితులు ఎవరు? వారు పెన్షన్ డిమాండ్ చేయడానికి గల కారణాలు ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేయండి. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Uttam Kumar Reddy: 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవకుంటే రాజకీయ సన్యాసం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బట్టతల బాధితుల సంఘం డిమాండ్..

కాగా నేడు సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో బట్టతల బాధితుల సంఘం వారు సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా తమ సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బట్టతల బాధితుల సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా వెళ్ది బాలయ్యను ఎన్నుకున్నారు. ఇక ప్రధాన కార్యదర్శిగా రాజేశం, కోశాధికారిగా రాము ఎన్నికయ్యారు.

Telangana: ఎమ్మెల్యేల ఎర కేసులో ఊహించని ట్విస్ట్..సీబీఐ ఢిల్లీ విభాగానికి దర్యాప్తు బాధ్యతలు

 బట్టతల బాధితుల సంఘ మొట్టమొదటి అధ్యక్షునిగా బాలయ్య..

ఈ ఎన్నిక అనంతరం బట్టతల బాధితుల సంఘ అధ్యక్షుడు బాలయ్య మాట్లాడుతూ..తమను కూడా మానసిక వికలాంగుల కింద పరిగణించాలని సీఎం కేసీఆర్ ను కోరారు. సమాజంలో బట్టతల ఉన్న వారు అనేక ఇబ్బందులను గురవుతున్నారు. అందుకే ప్రభుత్వం స్పందించి సంక్రాంతి పండుగ లోపు రూ.6000 పెన్షన్ అందజేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం అన్నారు.

ప్రస్తుత సమాజంలో బట్టతలతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిని ఈ సమస్య వేధిస్తుంది. ఇక బట్టతలతో ఇబ్బంది పడుతున్న యువకుల బాధ వర్ణనాతీతం. ఈ సమస్యతో బాధపడుతున్న వారు నలుగురిలో కలవడానికి జంకుతున్నారు. బట్టతల సమస్య మానసికంగా వారిని కుంగదీస్తుంది. ఈ క్రమంలోనే వారు ఫించన్ డిమాండ్ ను లేవనెత్తారు. మరి వీరి డిమాండ్ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

First published:

Tags: Bald Head, Hyderabad, Siddipet, Telangana

ఉత్తమ కథలు