తెలంగాణ ఫారెస్ట్ సిబ్బంది సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి తాము విధులకు హాజరు కాబోమని తెలిపారు. పోలీసులకు ఇచ్చినట్టు మాకు తుపాకులు (Guns) ఇవ్వాలని ఫారెస్ట్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాతపూర్వకంగా హామీ ఇస్తేనే విధుల్లోకి చేరుతామని ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు. కాగా భధ్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో గుత్తికోయల (tribals) దాడిలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు (Srinivasa Rao) మరణించిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియల్లో పాల్గొన్న అటవీశాఖ సిబ్బంది తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని మంత్రుల ఎదుట నినాదాలు చేశారు. తమ ప్రాణ రక్షణకు ప్రభుత్వం తుపాకులు ఇవ్వాలనే డిమాండ్ ను లేవనెత్తారు ఫారెస్ట్ సిబ్బంది.
గతంలోనూ డిమాండ్..
అయితే గతంలోనూ అటవీశాఖ సిబ్బంది తమకు ఆయుధాలు కావాలని డిమాండ్ చేశారు. తాము అడవుల్లో విధులు నిర్వహించాలంటే మాకు తుపాకులు కావాలని తమ ప్రాణ రక్షణ కోసం ఆయుధాలు ఇవ్వాలని కోరారు. అయితే దానిపై ప్రభుత్వం స్పందించలేదు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులకు అక్కడి స్థానికులకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇక నిన్న ఖమ్మం (Khammam) జిల్లాలో ఏకంగా ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ (Srinivasa Rao) పై గుత్తికోయలు కొడవలితో దాడి చేశారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు (Srinivasa Rao) మృతితో మరోసారి ఆయుధాల అంశం తెరపైకి వచ్చింది.
శ్రీనివాస్ కుటుంబానికి అండగా ప్రభుత్వం..
కాగా శ్రీనివాస్ మృతి పట్ల ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబానికి 50 లక్షల భారీ పరిహారంతో పాటు అతను డ్యూటీలో ఉంటే ఎలాగైతే జీత భత్యాలు ఇస్తారో అలాగే ఇప్పుడు కూడా అలాగే అందించాలని రిటైర్ వయస్సు వచ్చే వరకు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు కుటుంబంలోని ఒకరికి అర్హత గల ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
పాడే మోసిన మంత్రులు..
నేడు ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస రావు అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని పాడే మోశారు. ఆ అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ప్రాణాలకు రక్షణగా పోలీసులకు ఇచ్చినట్టు తమకు తుపాకులు ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు నిరసన చేపట్టారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీనిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.