కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. వీల్‌చైర్‌లో గాంధీభవన్‌కి వచ్చిన డీఎస్.. కాంగ్రెస్‌లో తిరిగి చేరుతుండటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తన చిన్న కొడుకు సంజయ్‌తో కలిసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
డీఎస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరే అంశం కొంత గందరగోళానికి దారితీసింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరరు అనీ.. తన అబ్బాయి సంజయ్‌ని ఆశీర్వదించేందుకు మాత్రమే గాంధీనగర్‌కి వస్తారని ఓ లేఖ కలకలం రేపింది. కానీ.. డీఎస్ ఆ లేఖను ఖండించారు. అది ఎవరు రాశారో తనకు తెలియదన్నారు. తాను మాత్రం కాంగ్రెస్‌లో చేరేందుకే తిరిగి వచ్చినట్లు తెలిపారు.
ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Father of #BJP MP #ArvindDharmapuri and former #Congress President of Andhra Pradesh (United), Veteran politician, #DSrinivas to rejoin the @INCIndia today.#DharmapuriSrinivas reached Gandhi Bhavan in #Hyderabad on wheelchair. #Telangana pic.twitter.com/pkA9hLQIdt
— Surya Reddy (@jsuryareddy) March 26, 2023
డీఎస్ ప్రస్తుతం ఇదివరకంత హుషారుగా లేరు. ఆయన వయసు రీత్యా కొన్ని సమస్యలున్నాయి. మాట్లాడేందుకే ఇబ్బంది పడుతున్నారు. మాట్లాడేటప్పుడు చేతులు వణుకుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన.. వీల్‌చైర్‌లో గాంధీభవన్‌కి రావాల్సి వచ్చింది. మొత్తంగా ఓ సీనియర్ తమ పార్టీలో మళ్లీ చేరడం పార్టీ శ్రేణులకు ఉత్సాహం ఇస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.