Home /News /telangana /

SENIOR DIRECTOR K VISWANATH SAYS INTERESTING NEWS TO TELANGANA CM KCR AK

కేసీఆర్‌తో దర్శకుడు విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

కె. విశ్వనాథ్, కేసీఆర్

కె. విశ్వనాథ్, కేసీఆర్

తన ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న ఊహాగానాలపై సీఎం కేసీఆర్‌కు వివరించిన విశ్వనాథ్... ఆయనకు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు.

    తనను కలిసేందుకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్. తన ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న ఊహాగానాలపై సీఎం కేసీఆర్‌కు వివరించిన విశ్వనాథ్... తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయనకు తెలిపారు. అయితే తనకు మోకాళ్ల నొప్పులున్నాయని కేసీఆర్‌కు వివరించారు. ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు అంటున్నారని... కానీ తనకు ఆపరేషన్ అంటే భయమని చెప్పుకొచ్చారు. అసలు తనకు హాస్పిటల్ అంటేనే భయమని కేసీఆర్‌కు తెలిపారు దర్శకుడు విశ్వనాథ్. అందుకే తన సినిమాల్లో ఎక్కడా ఆసుపత్రి సీన్లు కూడా పెట్టనని కేసీఆర్‌కు వివరించారు కళాతపస్వి. తనకు రక్తం అంటే భయమని... అందుకే ఆపరేషన్ చేయించుకోవాలని అనుకోవడం లేదని కేసీఆర్‌కు తెలిపారు. ఇక మిగిలిన జీవితం ఇలాగే గడిపేస్తానని కేసీఆర్‌తో అన్నారు విశ్వనాథ్.

    మీరే స్వయంగా మా ఇంటికి రావడం మా అదృష్టమని కేసీఆర్‌తో విశ్వనాథ్ అన్నారు. రాత్రి మీరు నాతో ఫోన్లో మాట్లాడి, ఇంటికి వస్తున్నానని చెబితే, ఎవరో గొంతు మార్చి మాట్లాడుతున్నారని అనుకున్నానని ఆయనతో అన్నారు. మీరే మాట్లాడారని తేల్చుకున్నాక రాత్రి 12 గంటల వరకు నిద్ర పట్టలేదని కేసీఆర్‌కు తెలిపారు. మీరు చేసే పనులను, ప్రజల కోసం తపించే మీ తత్వాన్ని టీవీల్లో, పత్రికల్లో చూస్తున్నానని...నేరుగా చూడడం ఇదే మొదటిసారి అని అన్నారు. గతంలో మీలాగే ఒకసారి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్ మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. మీకు తెలుగు భాషపైనా, సాహిత్యంపైనా మంచి పట్టుందని కేసీఆర్‌పై పొగడ్తలు కురిపించారు.




    First published:

    Tags: CM KCR, K viswanath, Telangana, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు