SELF LOCKDOWN DECLARED IN A VILLAGE OF RAJANNA SIRICILLA DISTRICT VRY KNR
Siricilla : సెల్ఫ్ లాక్డౌన్లోకి ఆ గ్రామాలు.. సిరిసిల్లలో ఒమిక్రాన్ కేసులు
ప్రతీకాత్మక చిత్రం
Siricilla : తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు బయటపడుతుండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ గ్రామస్తుడికి ఒమిక్రాన్ సోకడంతో గ్రామస్తులంతా సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్డౌన్ మళ్ళీ ప్రారంభమైంది. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామస్తులు సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. జిల్లాకు చెంది, ఇటీవల దుబాయ్ నుంచి గూడెంకు వచ్చిన పిట్ల చంద్రం అనే వ్యక్తికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.. తాజాగా అతని తల్లి, భార్యలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో గ్రామంలో 10 రోజుల పాటు లాక్డౌన్ విధించారు. ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపురంలో ఒమిక్రాన్ బాధితుడు ఓ శుభకార్యంలో పాల్గొన్నాడు. అక్కడ కూడా 53 మంది నమూనాలు సేకరించి, వారిని ఇళ్ల నుంచి బయటకు రావద్దని వైద్యాధికారులు ఆదేశించారు.
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి వైద్యాధికారలు నివేదిక ప్రకారం బుధవారంనాడు 14 ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఇప్పటికి 38మందికి ఒమిక్రాన్ సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇక కరోనా కేసులకు సంబంధించి గడిచిన ఒక్క రోజులో 37,353 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిం చగా.. కొత్తగా 182 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. దీంతో మొత్తం గా ఇప్పటివరకు నమోదైన కేసుల సం ఖ్య 6,80,074కి గా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
మరోవైపు క్రిస్మస్తో పాటు న్యూ ఇయర్ వేడుకలకు హైకోర్టు బ్రేకులు వేసింది. కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగిన నేపథ్యంలో ఒమిక్రాన్ దృష్ట్యా ఈ వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే జనం గుంపులు గుంపులుగా గుమి గూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఎయిర్ పోర్ట్‌లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయలని ధర్మాసనం ఆదేశించింది.
కాగా ఒమిక్రాన్ తీవ్రత రాష్ట్రంలో పెరుగుతున్న నేపథ్యంలోనే దేశ ప్రధాని ఆయా రాష్ట్రాలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈక్రమంలోనే తెలంగాణలో కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన పరిస్థిలోకి వెళ్లిపోయారు. కాగా ప్రభుత్వం ఇది వరకే కరోనా తగ్గుమొఖం పట్టిన నేపథ్యంలోనే నిబంధనలను సడలించింది. పబ్లిక్ ప్రాంతాలతో పాటు ప్రైవేటు పార్టీలపై ఆంక్షలను తొలగించింది. దీంతో సాధారణ జన జీవనానికి ప్రజలు అలవాటు పడిపోయారు.
ఈ క్రమంలోనే ఒమిక్రాన్ కేసుల విజృంభన మరోసారి భయాందోళనకు గురి చేస్తున్న క్రమంలోనే హైకోర్టు జోక్యం చేసుకుంది. కాగా ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు క్రిస్మస్ వేడుకలతో పాటు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాయి.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సైతం హైకోర్టు ఆదేశాలతో పండుగలు, ఉత్సవాలపై నిషేధం విధించే దిశగా నిర్ణయాలు తీసుకోనుంది.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.