Home /News /telangana /

Impact Foundation: ఇంపాక్ట్ ఫౌండేషన్ శిక్షకుడిగా డిగ్రీ కళాశాల అధ్యాపకుడు.. 45 మందిలో ఒకడిగా..

Impact Foundation: ఇంపాక్ట్ ఫౌండేషన్ శిక్షకుడిగా డిగ్రీ కళాశాల అధ్యాపకుడు.. 45 మందిలో ఒకడిగా..

ఇంపాక్ట్ ఫౌండేషన్

ఇంపాక్ట్ ఫౌండేషన్

Impact Foundation ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు వ్యక్తిత్వ వికాసం, జీవన విలువలు, మోటివేషన్ కోసం చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రముఖంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మొదలగు రాష్ట్రాలలో పేరుపొందిన ఇంపాక్ట్ సంస్థ మోటివేషన్ స్పీకర్ లకు శిక్షణ ఇవ్వడం కోసం గత నెల 45 మంది శిక్షణ అర్హులను సెలెక్ట్ చేశారు.

ఇంకా చదవండి ...
  (K.Veeranna,News18,Medak)

  ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు వ్యక్తిత్వ వికాసం, జీవన విలువలు, మోటివేషన్ కోసం చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రముఖంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మొదలగు రాష్ట్రాలలో పేరుపొందిన ఇంపాక్ట్ సంస్థ మోటివేషన్ స్పీకర్ లకు శిక్షణ ఇవ్వడం కోసం గత నెల 45 మంది శిక్షణ అర్హులను సెలెక్ట్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు జరిగిన శిక్షణలో 28 రోజులు ఆన్ లైన్ ద్వారా రెండు రోజులు ఆఫ్ లైన్ ద్వారా హైదరాబాదులోని ఒక ప్రముఖ హోటల్లో శిక్షణను ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, స్వయం ప్రత్తిలోని ఎమ్మెస్సి ఫిషరీస్ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న డా.తూమోజు జగదీశ్వరా చారి ఎంపికయ్యారు.

  Sub Inspector: ఆ ఎస్సై వివాహితతో బెడ్ పైనే రచ్చ రచ్చ.. ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన భర్త.. తర్వాత ఏం జరిగిందో చూడండి..


  కాగా ఈ శిక్షణ కార్యక్రమంలో పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం, టైం మేనేజ్మెంట్, లైఫ్ స్కిల్స్ మూర్తిమత్వ అభివృద్ధి, తదితర అంశాలలో శిక్షణ పొంది ఉత్తీర్ణులయ్యారు‌. భవిష్యత్తులో సమాజంలో తన వంతు పాత్రగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పైన పేర్కొన్న అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు ఇంపాక్ట్ సంస్థ అధినేత గంప నాగేశ్వరరావు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విద్యార్థుల్లోని ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టడానికి మొబైల్ వినియోగం వల్ల వచ్చే అవాంతరాలను తెలియజేస్తూ ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి తమ సంస్థ తరఫున శిక్షణ పొందిన అంతా కృషి చేస్తున్నారని వారు తెలియజేశారు.

  Mini Family Story: భర్త చేసిన పనికి.. ఆమె ఇలా బిడ్డను ఎత్తుకొని బయటకు రావాల్సి వచ్చింది. ఏం జరిగిందంటే..


  ఇంపాక్ట్ ఫౌండేషన్ వంటి సంస్థలో శిక్షకుడిగా తమ కళాశాల అధ్యాపకుడు ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డా.సి.హెచ్.ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డా.కె.హుస్సేన్ ,ఐక్యూఏసి కో-ఆర్డినేటర్ డా.సి.హెచ్.మధుసూదన్, అకడమిక్ కో-ఆర్డినేటర్ డా.గోపాల సుదర్శనం, పిజి కో-ఆర్డినేటర్ డా.పి.అయోధ్య రెడ్డి, డా.భవాని,డా.శ్రద్ధానందం ఇతర అధ్యాపకులు మరియు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

  Sad Incident: ఆమె ఎన్నో ఆశలతో ఇంటర్ కాలేజీలో జాయిన్ అయింది.. అతడు చేసిన ఆ పనికి.. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది..


  జీవితం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు మలుచుకోవడం యువతకు స్ఫూర్తి గా యువతను ఉత్తేజపరుస్తూ ఇంపాక్ట్ ఫౌండేషన్ 1996 సంవత్సరంలో స్థాపించారు గంప నాగేశ్వరరావు. . మెదట తనంతట తాను పాఠశాలలకు, కళశాలలకు వెల్లి ఉచితంగా మొటివేషన్ క్లాసులు చెప్పేవారు,ఇలా రాష్ట్రమంతట అన్ని జిల్లాలను తిరిగారు.

  Saraswati Temple In Basara: భక్తులతో కిటకిటలాడిన సరస్వతి ఆలయం.. ఆలయ ప్రత్యేకత ఏంటంటే..


  తన ఆశయం బాగుందని తనతో కలిసి పని చెయ్యడానికి ఎందరో ఐఏఎస్, లు, ఐపీఎస్, సైకియాట్రిష్టులు, నటులు, రచయితలు, సంఘసంస్కర్తలు ముందుకొచ్చి తమ సక్సెస్ స్టోరీ లు చెబుతూ , విద్యార్దులలో ఆలోచన అనే బీజాన్ని రేకెత్తిస్తున్నారు. ఇలా ఆ మొక్క పెరిగి పెద్దదై ఎంతో మంది విద్యార్థులకు, వ్యాపారవేత్తలకు మోటివేషన్ ఇవ్వడంలో విజయవంతం అయింది. దీనిలో ఎంతో మంది వక్తలు తమ అమూల్యమైన ప్రసంగాలను వినిపించారు. దీని ద్వారా మోటివేట్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Impact foundation, Medak, Medak District news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు