హోమ్ /వార్తలు /telangana /

Nizamabad : విచారణ భయమా..? దేవుడి భయమా..? ఎత్తుకెళ్లిన దేవుడి విగ్రహాలు తిరిగి వెనక్కి ఇచ్చిన దొంగలు... ఎక్కడంటే..

Nizamabad : విచారణ భయమా..? దేవుడి భయమా..? ఎత్తుకెళ్లిన దేవుడి విగ్రహాలు తిరిగి వెనక్కి ఇచ్చిన దొంగలు... ఎక్కడంటే..

Nizamabad : దొంగతనం జరిగిన తర్వాత పోలీసులకు పట్టుపడితే తప్ప చోరీ సొమ్మును తిరిగి ఇచ్చే పరిస్థితి కనబడదు. కాని ఓ చోరికి గురైన దేవుడి విగ్రహాలు మాత్రం వెనక్కి వచ్చాయి.. దొంగతనం జరిగిన ఇరవై రోజుల తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ఆలయానికి తెచ్చి పూజారికి ఇచ్చారు.

ఇంకా చదవండి ...

  దేవుడంటే భయమో లేక పోలీసుల విచారణలో దొరుకుతామనే భయమో మొత్తం మీద చోరికి గురైన సీతారాముల పంచలోహ విగ్రహాలు అదే గుడికి చేరుకున్నాయి. ఇరవై రోజుల క్రితం విగ్రహాలను ఎత్తుకెళ్లిన దొంగలు అన్నా ప్రసాదం కోసం విరాళం ఇస్తున్నామంటూ ఓ మూటను తెచ్చి ఇచ్చిన సంఘటన సంచలనంగా మారింది.

  వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా న‌వీపేట్ మండ‌లం కంద‌కుర్తి రామాల‌యంలో జ‌న‌వ‌రి 7న కందకుర్తి రామాలయం లో శ్రీరాముడు సీత‌ల పంచాలోహ 20 కేజీల విగ్ర‌హాం, మ‌రో ఐదు కేజీల రాగి విగ్ర‌హాలు, వెండి కిరాలు దొంగ‌లు దోచుకేళ్లారు. ఈ క్రమంలోనే గుడి పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటెజీని పరిశీలించి దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. అయితే అనుహ్యాంగా విగ్రహాలు ఆలయంలో ప్రత్యక్షమయ్యాయి.

  కాగా చోరికి గురైన విగ్రహాలను జనవరి 25న గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉమ్రి బిర్జు మహారాజ్ జోషి అనే వ్యక్తి రామాలయంలో నిర్వహిస్తున్న అన్నదానానికి ఉమ్రి బిర్జు మహారాజ్ జోషి అనే వ్యక్తి సరుకులు పంపించారని పూజారికి చెప్పారు. అయితే వాటిని తీసుకున్న పూజారి బిర్జు మహారాజ్ జోషి ఎవరో తెలియకపోవడంతో వాటిని గుడిలోనే భద్రపరిచారు. కాగా ఫిబ్రవరి 2న గుడిలో అన్నదానం ఉన్న నేపథ్యంలోనే పూజారి నిన్న ఆ ప్యాకేజీలను విప్పి చూశాడు. కాగా అందులోని ప్యాక్‌లలో 10 కిలోల బియ్యం, 5 కిలోల రవ్వ, 5 కిలోల పంచదార ఉన్నాయి.. మరో బ్యాగ్ విప్పి చూడగా అందులో 3 అట్ట డబ్బలు ప్యాక్ చేయబడి ఉన్నవి. అందులో ఒక అట్ట డబ్బా విప్పి చూడగా మొదటి డబ్బాలో సీత రాముల ఉత్సవ విగ్రహం ఉండడంతో వెంటనే విషయాన్ని ఇతర పూజారులకు తెలిపి వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు.

  దీంతో సంఘటనపై స్పందించిన పోలీసులు విగ్రహాలు ఎవరు ఎత్తుకెళ్లారు. తిరిగి ఎందుకు తీసుకువచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నామని చెబుతున్నారు. విచారణకు బయపడి ఇచ్చారా లేక, దేవుడిపై భయంతో ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది.

  First published:

  Tags: Telangana, Theft

  ఉత్తమ కథలు