Home /News /telangana /

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై ఆన్‌లైన్‌లో స్మార్ట్ కార్డుల రీచార్జ్‌.. ఎలా చేయాలంటే..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై ఆన్‌లైన్‌లో స్మార్ట్ కార్డుల రీచార్జ్‌.. ఎలా చేయాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్ కార్డులున్న రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇకపై ఆన్‌లైన్‌లో స్మార్ట్ కార్డులను రీచార్జ్ చేసుకోవచ్చని తెలిపింది.

    స్మార్ట్ కార్డులున్న రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇకపై ఆన్‌లైన్‌లో స్మార్ట్ కార్డులను రీచార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అవకాశం కల్పిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. స్మార్ట్ కార్డులు కలిగి ఉన్న ప్రయాణికులు ‘UT Sonmobile’వెబ్ పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా వారి కార్డులను ఆన్‌లైన్‌లో రీ-ఛార్జ్ చేసుకోవచ్చు. తద్వారా రిజర్వ్ చేయని టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘గతంలో స్మార్ట్‌కార్డులో బ్యాలెన్స్ అయిపోయినప్పుడు.. ప్రయాణికులు కార్డులను రీచార్జ్ చేసుకునేందుకు బుకింగ్ కౌంటర్స్ వద్దకు రావాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియను సులభతరం చేసేందుకు వారి స్మార్ట్ కార్డులను ఆన్‌లైన్‌లో రీచార్జ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాం’అని తెలిపారు.

    ఈ సదుపాయం కల్పించడం ద్వారా బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడానికి అవకాశం కలుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జనాలు క్యూలైన్ బాట పట్టకుండా ఇది కొంత వరకు ఉపయోగపడుతుందని అన్నారు. ఆన్‌లైన్‌లో స్మార్ట్ కార్డులను రీచార్జ్ చేసుకుంటే.. వారికి విలువైన సమయం కూడా కలిసి వస్తుందని చెప్పారు. కౌంటర్ల వద్ద రద్దీని నివారించడానికి ఆన్‌లైన్ పద్దతిని ఉపయోగించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.

    ఆన్‌లైన్‌ రీచార్జ్‌ సౌకర్యాన్ని ప్రయాణికులు విశేషంగా స్వాగతిస్తారని ఆశిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య పేర్కొన్నారు. ఇక, ప్రయాణికులు టికెట్లు పొందడానికి కనీసం రూ.100తో మొదటిసారి స్మార్ట్‌కార్డు రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

    రీచార్జ్ ఎలా చేసుకుకోవాలంటే..
    1. తొలుత http://www.utsonmobile.indianrail.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
    2. అక్కడ స్మార్ట్ కార్డు రీచార్జ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అమౌంట్‌ ఎంతో ఎంటర్ చేయాలి.
    3. తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాకింగ్.. ఇలా ఏదో ఒక రూపంలో రీచార్జ్ చేసుకోవాలి.
    4. పేమెంట్ ధ్రువీకరణ పొందిన తర్వాత.. వినియోగదారులు ATVM వద్దకు వెళ్లాలి. ATVM పైన స్మార్ట్ కార్డును ఉంచాలి. రీచార్జ్ స్మార్ట్ కార్డు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ATVM ఆటోమెటిక్‌గా వివరాలు క్రోడికరించి.. స్మార్ట్ కార్డులోకి డబ్బులు వచ్చేస్తాయి.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Indian Railway, Secunderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు