ప్రైవేట్ చేతికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ప్రయాణికుడికి తప్పని భారం ?

ఇతర జోన్లలో ఉన్న మరికొన్ని స్టేషన్లు కూడా ఐఆర్‌ఎస్‌డీసీ చేతిలోకి వెళ్లిపోయాయి.

news18-telugu
Updated: July 10, 2019, 9:00 AM IST
ప్రైవేట్ చేతికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ప్రయాణికుడికి తప్పని భారం ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్... ఎలాంటి పండగలు, పబ్బాలు లేకపోయినా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఇక పండగల సమయంలో వేరే చెప్పనెక్కర్లేదు. నిత్యం వచ్చే పోయే వారితో ... వేలాది ప్రయాణికులతో ఫుల్ రష్‌గా ఉంటుంది. అయితే తాజాగా ఈ స్టేషన్‌ను ప్రైవేట్ చేతికి ఇవ్వడానికి రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్న రైల్వేశాఖ ప్రధాన నగరాల్లోని స్టేషన్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్న నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రైల్వే కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అయితే రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం కనుక అమలై స్టేషన్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రయాణం తడిసి మోపెడు అవ్వడం ఖాయమని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన స్టేషన్ల నిర్వహణతో పాటు.. ప్లాట్ ఫాం టికెట్స్, పారిశుధ్య నిర్వహణ, పార్కింగ్ వంటి సేవల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఇప్పటికే ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ)కి అప్పగించింది.

దీంతోపాటు ఇతర జోన్లలో ఉన్న మరికొన్ని స్టేషన్లు కూడా ఐఆర్‌ఎస్‌డీసీ చేతిలోకి వెళ్లిపోయాయి. స్టేషన్లను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టడం వల్ల ఉద్యోగాలు తగ్గిపోవడంతోపాటు ప్రయాణికులపై భారం పడుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రైల్వే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. మరి దీనిపై రైల్వే శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

First published: July 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు