Home /News /telangana /

SECUNDERABAD RAILWAY STATION OLD AGE PEOPLE AND DIVYANGS FACING LOTS OF PROBLEMS AS LIFT ELEVATOR NOT WORKING IN STATION SK

Secunderabad Railway Station: సికింద్రాబాద్‌ స్టేషన్‌లో పనిచేయని లిఫ్ట్.. మెట్లు ఎక్కలేక వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చాలా రోజులుగా లిఫ్ట్ పనిచేయడం లేదు. ఒక ప్లాట్‌ఫారమ్ నుంచి మరొకదానికి వెళ్లేందుకు లిఫ్ట్ లేకపోవడంతో... వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..! తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన స్టేషన్ ఇది. ఇక్కడి నుంచి దేశ నలుమూలలకు.. సుదూర ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు సాగుతాయి. నిత్య వందలాది రైళ్లల్లో.. లక్షలాది మంది గమ్యస్థానాలకు వెళ్తుంటారు. వేలాది ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. ఇక్కడ నిత్యం రద్దీ ఉంటుంది. అలాంటి రైల్వే స్టేషన్‌లో మౌలిక సదుపాయాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన రైల్వే సేవలు అందించడంలో విఫలమవున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ (Secunderabad Railway Station)లో కొన్ని రోజులుగా లిఫ్ట్ పనిచేయడం లేదు. ఒక ప్లాట్‌ఫారమ్ నుంచి మరొక ప్లాట్‌ఫారమ్‌కి వెళ్లాలంటే.. మెట్ల మార్గంలో వెళ్లాలి. ఎలివేటర్‌ ఉంటే ఈజీగా వెళ్లొచ్చు. కానీ కొన్ని నెలలుగా ఇక్కడ ఎలివేటర్ పనిచేయకపోవడంతో.. వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారు కూడా మెట్ల మార్గంలోనే అవస్థలు పడుతూ ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్తున్నారు. లిఫ్ట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. లగేజీ బరువుతో వెళ్లేవారికి మరింత కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    పనిచేయని లిఫ్ట్ ఇదే


    వాహనదారులకు గుడ్​న్యూస్​.. తెలంగాణలో పెట్రోల్, డీజిల్​ హోం డెలివరీ .. వివరాలివే..

    కొందరు ప్రయాణికులు ఇండియన్ రైల్వేస్ (Indian Railways) వెబ్‌సైట్లో ఈ లిఫ్ట్ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. కానీ సాంకేతిక సమస్య వల్ల ఫిర్యాదు తీసుకోవడం లేదు. ఈ క్రమంలో 'ట్విటర్' వేదికగా రైల్వే సేవ (Railway Seva)కు ఫిర్యాదు చేశారు. లిఫ్ట్ ఫొటో తీసి.. రైల్వేసేవకు ట్యాగ్ చేస్తున్నారు. ఇంకొందరు 'వాట్సాప్‌'లో రైల్ మదద్‌  (Rail Madad)విభాగానికి కంప్లైంట్ చేశారు. ఐనప్పటికీ అధికారులెవరు స్పందించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. స్టేషన్‌లో ఉండే అధికారుల వద్దకు వెళ్లి కూడా మరికొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు తప్ప.. ఎప్పుడు రిపేర్ అవుతుందో స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. ఫలితంగా.. చాలా రోజులుగా ఆ లిఫ్ట్ నిరూపయోగంగా ఉంది. 'ఎస్కలేటర్ అండర్ రిపేర్' అని ఓ బోర్డును లిఫ్ట్ ముందు ఉంచారు. చాలా రోజులుగా ఇది అక్కడే ఉంది. కానీ ఇంకా మరమ్మతు చేయలేదు. లిఫ్ట్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. వీలైనంత త్వరగా లిఫ్ట్‌కు మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



    కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈనెల 17న పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆర్మీ అభ్యర్థులు ఆందోళనలు చేశారు. ఐతే వీరి ఆందోళన కార్యక్రమం అదుపుతప్పి హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌లోని దుకాణాలు, ఫర్నిచర్‌ని ధ్వంసం చేశారు. పలు రైళ్లకు నిప్పుబెట్టారు. ఐతే ఈ ఘటనకు ముందు నుంచే.. అక్కడ లిఫ్ట్ పనిచేయడం లేదు. అల్లర్ల తర్వాత సికింద్రాబాద్‌లో డిస్‌ప్లే  బోర్డులు, ఫ్యాన్లు,  ఇతర సామాగ్రి  కూడా ధ్వంసమయ్యాయి. వాటిని క్రమంగా మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. వాటితో పాటు లిఫ్ట్‌ను కూడా రిపేర్ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Secunderabad, Secunderabad railway station, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు